రైతుల కోసం కిసాన్ సమ్మాన్ నిధిని మరింత పెంచుతున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రకటించారు. వ్యవసాయ రంగంలో సవాళ్లు ఎదుర్కొనేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తామన్నారు. క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాంకు రూ.2వేల కోట్ల కేటాయించామన్నారు. చిరుధాన్యాల పంటలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. శ్రీఅన్న పథకం ద్వారా చిరుధాన్యాల రైతులకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. రూ.20 లక్షల కోట్లు వ్యవసాయ రుణాలు అందిస్తామన్నారు. సహకారంతో సమృద్ధి విధానంలో రైతులకు ప్రోత్సాహం ఇస్తామని పేర్కొన్నారు. వ్యవసాయ స్టార్టప్‌ల ప్రోత్సాహకానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు.
Budget 2023: రైల్వే శాఖకు బడ్జెట్ బూస్ట్.. రికార్డు స్థాయిలో నిధులు కేటాయింపు
వ్యవసాయ అభివృద్ధి ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామన్నాని.. వ్యవసాయ పరపతి సంఘాలను డిజటలైజ్ చేస్తామని సీతారామన్ ప్రకటించారు. ఉద్యాన, చిరుధాన్యాల పంటలకు చేయూత అందిస్తామన్నారు. కరువు ప్రాంత రైతులకు 5వేల 300 కోట్లు కేటాయించారు. వ్యవసాయంతో పాటు డెయిరీ, మత్స్యశాఖలను కూడా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మత్స్య కారుల అభివృద్ధి కోసం ఈ ఏడాది భారీగా నిధులు కేటాయించారు. అందులో భాగంగా పీఎం మత్స్య సంపద యోజనకు అదనంగా రూ.6వేల కోట్లు కేటాయించారు. అలాగే రైతుల ఉత్పత్తుల నిల్వ కోసం గిడ్డంగుల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
DK Aruna : బడ్జెట్ బడుగు బలహీనవర్గాలకు ఊతం ఇచ్చి, దేశ ప్రగతికి దోహద పడేలా ఉంది