Site icon NTV Telugu

Chandrababu: తుఫాను సహాయక చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి..

Chandrababu

Chandrababu

Chandrababu: టీడీపీ కార్యకర్తలు, నేతలు తుఫాను బాధితులకు అండగా నిలవాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. పలు జిల్లాలపై తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఆయన అన్నారు. టీడీపీ శ్రేణులు బాధిత వర్గాలకు అండగా ఉండాలి.. చేతనైన సాయం చేయాలన్నారు. తుఫాను సహాయక చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని.. రైతులకు నష్టాన్ని నివారించేలా తక్షణ చర్యలు చేపట్టాలని సూచనలు చేశారు.

Read Also: CM YS Jagan: తుఫాను పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష

రాష్ట్రంపై మిచౌంగ్ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సమాచారం ఆందోళన కలిగిస్తోందన్నారు చంద్రబాబు. పక్కా ప్రణాళిక ద్వారా అన్నదాతలకు నష్టం జరగకుండా చూడాలన్నారు. గతంలో అకాల వర్షాల కారణంగా ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోయినా.. ప్రభుత్వం తగు రీతిలో స్పందించ లేదన్నారు. ధాన్యం కొనుగోలులో రకరకాల ఆంక్షలతో ఇప్పటికే రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. పంట చేతికి వచ్చే సమయంలో తుఫాను అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందన్నారు. ధాన్యం కొనుగోలులో ఆంక్షలు తొలగించాలని చంద్రబాబు పేర్కొన్నారు. తుఫాను బాధిత ప్రజల కోసం షెల్టర్లు, అవసరమైన ఆహారం అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

Exit mobile version