తరగతి గదుల్లో చదువుకోవాల్సిన విద్యార్థులు కూలీలుగా మారారు. విద్యార్థులతోనే బెంచీలను తరలించారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. నిధులు లేవని విద్యార్థులను ప్రమాదంలోకి నెట్టేశారు ఉపాధ్యాయులు. పురానిపేట ప్రభుత్వ పాఠశాల లో బెంచీలా కోసం కూలీలుగా మారారు విద్యార్థులు. పురానిపేట ప్రభుత్వ పాఠశాల నుండి సుమారు 10 కిలోమీటర్ల దూరం ఉన్న జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల ప్రభుత్వ పాఠశాల నుండి విద్యార్థులే కూలీలై బెంచీలను తరలించారు.
Also Read:Tejashwi Yadav: ఆ పరిస్థితి వస్తే ఎన్నికల్లో పోటీ చేయను.. తేజస్వి యాదవ్ హెచ్చరిక
ఓపెన్ ట్రాలీలో ప్రమాదకరంగా విద్యార్థుల తో బెంచీలా ను తరలించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో కూర్చోవాల్సిన విద్యార్థులు ట్రాక్టర్ లో కనిపించడంతో వైరల్ గా మారింది. బెంచీలు లేక అవస్థలు పడుతుండడంతో పిల్లలతోనే బెంచీలు మోయిస్తూ ట్రాక్టర్ లో తరలిస్తున్నారు పాఠశాల సిబ్బంది. ప్రభుత్వ నుండి నిధులు రాకపోవడంతో దాత సహకారంతో ట్రాలీ లో బెంచి ల ను తరలించామని పాఠశాల హెడ్మాస్టర్ చెప్పుకొచ్చారు.
