Site icon NTV Telugu

Ponnam Prabhakar : GHMC అభివృద్ధిపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది

Ponnam Prabhakar

Ponnam Prabhakar

జీహెచ్‌ఎంసీలో అన్ని అంశాలపై సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. GHMC అభివృద్ధి పై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆయన తెలిపారు. వచ్చే సమ్మర్ లో నీటి ఎద్ధడికి ఎలాంటి సమస్య లేదని ఆయన అన్నారు. త్రాగునీటి సమస్య లేకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసామని ఆయన పేర్కొన్నారు. GHMCలో రెవెన్యూ పెంచుకోవడానికి ప్రత్యేక పాలసితో ముందుకు వెళ్ళబోతున్నామని ఆయన అన్నారు. మూసీ అభివృద్ధికి ఎలాంటి ఆటంకం కలుగకుండా చర్యలు ఉంటాయని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తామన్నారు. అర్బన్ అభివృద్ధి కోసం కేంద్రం సహకారం తీసుకునే ఆలోచనలో మా ప్రభుత్వం ఉందని, కేంద్ర ప్రభుత్వంతో మాకు ఎలాంటి విబేధాలు లేవు..

అభివృద్ధిలో కేంద్రాన్ని కలుపుకొని వెళ్తామన్నారు. హైదరాబాద్ అభివృద్ధి పై రోజూ వారీగా సమీక్షలు… సమస్యల పై రిపోర్ట్ తయారీ ఉంటుందన్నారు. GHMC పరిధిలో అధికారులు అలెర్ట్ గా ఉండాలని సూచన చేసామని, అప్పులు – ఆస్తులు అంశాల పై ముఖ్యమంత్రి కి నివేదిక ఇవ్వనున్నామన్నారు. గత ప్రభుత్వం తరహాలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు నిధుల కేటాయింపు ఉంటుందని, GHMC సమస్యల పై ప్రత్యేక నివేదిక తయారు చేయాలని ఆదేశించామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ల పై త్వరలోనే ప్రభుత్వం పాలసీ ప్రకటన చేస్తుందని, జీహెచ్‌ఎంసీలో త్రాగునీటి అంశంలో రాజకీయ అపోహలు మాత్రమే… ఎలాంటి సమస్యలు లేవని, వచ్చే సమ్మర్ లో సిటీలో త్రాగునీటి సమస్య ఉత్పన్నం కాదని ఆయన స్పష్టం చేశారు. అధికారుల సమన్వయం కోసం ప్రత్యేకంగా Osd నీ నియమిస్తున్నామన్నారు.

Exit mobile version