అల్లూరి జిల్లా పాడేరులో జరిగిన బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు.. గాయపడ్డ వారికి లక్ష రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.
Read Also: Pragya Jaiswal : కిర్రాక్ పోజులతో నెటిజన్స్ కు సండే ట్రీట్ అందించిన హాట్ బ్యూటీ..
బస్సు ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 23 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఒకరు 55 ఏళ్ల నారాయణమ్మగా గుర్తించారు. మరొక వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఈ ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో క్షతగాత్రులకు పాడేరు జిల్లా ఆస్పత్రిలో చికిత్సను అందిస్తున్నారు. పాడేరు ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిశీలించారు. అనంతరం అక్కడి నుండి పాడేరు జిల్లా ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి పరామర్శించారు.
Read Also: RC16: వైష్ణవ్ కే కాదు చరణ్ కూడా అతడే విలన్.. ?
అంతకుముందు అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్, ఆడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, జడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర బాధితులను పాడేరు జిల్లా ఆస్పత్రిలో పరామర్శించారు. మరోవైపు పాడేరు బస్సు ప్రమాదంలో గాయపడిన నలుగురిని మెరుగైన చికిత్స కోసం విశాఖ మెడికవర్ హాస్పిటల్ కు తరలించారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన చిన్నమ్మలు, బోడి రాజు, దుర్గ భవాని, రమణలకు చికిత్స అందిస్తున్నారు.