NTV Telugu Site icon

Minister Harish Rao: రాష్ట్రంలో పదివేలకు చేరువలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పడకలు

Harish Rao

Harish Rao

Minister Harish Rao: తెలంగాణ సర్కార్ రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సామాన్యులకు సైతం కార్పొరేట్ వైద్యం అందించే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. తాజాగా 2000పడుకల నిమ్స్ విస్తరణకు పరిపాలన అనుమతులు ఇచ్చారు. ఈ విషయమై తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు ట్వీట్ చేశారు. నిమ్స్‌ విస్తరణ కోసం ప్రభుత్వం రూ. 1,571 కోట్లు విడుదల చేసిందని పేర్కొన్నారు.

Read Also: Teacher MLC Voter List : టీచర్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు మరో అవకాశం.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..

ఇదిలా ఉంటే నిమ్స్‌లో ఇప్పటికే 1800 పడకలు అందుబాటులో ఉండగా. హైదరాబాద్‌ నగరానికి నాలుగు వైపులా నాలుగు టిమ్స్‌లను ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. వీటితో పాటు వరంగల్‌లో 2000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో మొత్తం తెలంగాణలో సూపర్ స్పెషాలిటీ పడకలు 10,000కి చేరువకానున్నాయి. ఇక నిమ్స్‌ విస్తరణలో భాగంగా ప్రభుత్వం రూ. 1571 కోట్లు విడుదల చేసింది. ఇందులో భాగంగా 2000 పడకల నిర్మాణం చేపట్టనున్నారు. వీటిలో 500 ఐసీయూ బెడ్స్‌, 42 విభాగాలు అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు సూపర్‌ స్పెషాలిటీ నర్సింగ్ అందుబాటులోకి రానుంది. దీనికి అనుబంధంగా హెల్త్‌ సైన్సెస్‌ ట్రైనింగ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.

Show comments