Selfi Video: నాకు చనిపోవాలని లేదు… కానీ చేసిన అప్పులు తీర్చలేకపోతున్నాను. అందుకే ఇలా చేయాల్సివస్తోంది.. అంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగి రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో వైరల్ అవుతోంది. ఈ సంఘటన హైదరాబాద్‌లో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌కు చెందిన అబ్దుల్ నవీద్ ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఈ సమయంలోనే అబ్దుల్ విపరీతంగా అప్పులు చేశాడు. అప్పులు భారీగా పెరగడం, చివరికి కుటుంబ పోషణ కూడా చూసుకోలేని పరిస్థితి వచ్చింది.
Read Also: Anasuya sister: యాంకర్ గా అనసూయ చెల్లి.. మరి అక్క పరిస్థితి!
దీంతో చావు ఒక్కటే తన సమస్యకు పరిష్కారం అని భావించిన అబ్దుల్.. జల్పల్లి చెరువు వద్దకు బైక్ పై వెళ్లి అక్కడే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోను చిత్రీకరించాడు. ప్రస్తుతం ఈ సెల్ఫీ వీడియో నోట్ కలకలం రేపుతోంది. ‘కుటంబ భారం మోయలేకపోతున్నాను. ఇక నా వల్ల కావడం లేదు నన్ను క్షమించండి. నా పేరు మీద ఇన్సూరెన్స్‌లు ఉన్నాయి. క్లైం చేసుకోండి’ అంటూ అబ్దుల్ చెప్పిన మాటలు అందరినీ షాక్ కి గురి చేశాయి.
Read Also: Corona : కరోనా తిప్పలు.. బాలికల విషయంలో సంచలన నిజాలు
అబ్దుల్ ఆత్మహత్య సమాచారాన్ని అందుకున్న పహాడీశెరీఫ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తినేందుకు గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. అయితే అబ్దుల్ మృతదేహాన్ని పోలీసులు ఇంకా గుర్తించలేదు. అతను నిజంగానే చెరువులోకి దూకాడా లేదా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.