AP CS Vijayanand: సీఎస్‌గా విజయానంద్.. ఉమ్మడి ఏపీలో గానీ, నవ్యాంధ్రలో గానీ ఇదే మొదటిసారి!
- నూతన సీఎస్‌గా విజయానంద్
- ప్రస్తుత సీఎస్ డిసెంబర్ 31తో పదవీవిరమణ
- టీడీపీ నేతలతో పాటు ప్రభుత్వ వర్గాల్లో చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ నియమితులయ్యారు. 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన విజయానంద్‌ను సీఎస్‌గా నియమిస్తూ ఆదివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ డిసెంబర్ 31తో పదవీవిరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కొత్త సీఎస్‌గా విజయానంద్ బాధ్యతలు చేపడతారు. బీసీ అధికారి విజయానంద్‌కు సీఎస్‌గా అవకాశం ఇవ్వడంతో టీడీపీ నేతలతో పాటు ప్రభుత్వ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది.
1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన బీసీ అధికారికి సీఎం చంద్రబాబు టాప్ పోస్ట్ ఇచ్చారని పలువురు టీడీపీ నేతలు, ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు నాయకత్వంలో బీసీ నేతలకు, అధికారులకు ఎప్పుడూ సమున్నత గౌరవం దక్కుతుందని అధికారులు అంటున్నారు. ఉమ్మడి ఏపీలో గానీ, నవ్యాంధ్రలో గానీ ఇప్పటి వరకు బీసీలకు సీఎస్ పోస్టు దక్కలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. తొలిసారి బీసీ అధికారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించిన సీఎంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
బీసీలకు నారా చంద్రబాబు ఎప్పుడూ పెద్దపీట వేస్తారని నేతలు, అధికారులు అంటున్నారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన టీటీడీ ఈవోగా బీసీ అధికారిగా శ్యామల రావు నియామకం జరిగిందంటున్నారు. అటు ప్రభుత్వంలోను, పార్టీలోనూ బీసీలకు చంద్రబాబు సముచిత స్థానం ఇచ్చారని నేతలు చర్చించుకుంటున్నారు. తెలుగు దేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా బీసీ నేత పల్లా శ్రీనివాస్‌కు అవకాశం ఇచ్చారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. శాసన సభ స్పీకర్‌గా మరో సీనియర్ నేత చింతకాలయ అయ్యన్న పాత్రుడుకు అవకాశం వచ్చిందంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో సీఎస్, డీజీపీ సహా అన్ని కీలక స్థానాల్లో తన సామాజిక వర్గానికి చెందిన వాళ్లనే వైఎస్ జగన్ నియమించారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!