NTV Telugu Site icon

Budget Sessions: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో నేడు అఖిలపక్ష భేటీ

Parliament

Parliament

Budget Sessions: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ఒకరోజు ముందుగా ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంప్రదాయ సమావేశం మధ్యాహ్నం పార్లమెంటు అనెక్స్ భవనంలో జరగనుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఈ సమావేశంలో పార్లమెంట్ సజావుగా సాగేందుకు ప్రభుత్వం అన్ని పక్షాల సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు.

Hockey : హాకీ ప్రపంచ చాంపియన్ షిప్ ను కైవసం చేసుకున్న జర్మనీ

విపక్షాలు ఈ సమావేశంలో ఆందోళన విషయాలను లేవనెత్తుతాయని, సెషన్‌లో లేవనెత్తాలనుకుంటున్న అంశాలను కూడా హైలైట్ చేయాలని భావిస్తున్నారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన సహకార వ్యూహాలపై చర్చించేందుకు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు సమావేశం కానున్నాయి. బడ్జెట్ సమావేశాలు రెండు భాగాలుగా జరగనున్నాయి.పార్లమెంటు ఉభయ సభల ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంతో సెషన్ ప్రారంభమవుతుంది. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. కేంద్ర బడ్జెట్ 2023-24 లోక్‌సభ ఎన్నికలకు ముందు చివరి పూర్తి బడ్జెట్ కావచ్చు. మొదటి భాగం జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగనుంది.

Show comments