Site icon NTV Telugu

Andhra Pradesh: డిస్కంలకు సర్కార్‌ శుభవార్త.. రూ.4,470 కోట్లు విడుదల..!

Discoms

Discoms

Andhra Pradesh: డిస్కంలకు శుభవార్త చెప్పంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. డిస్కంలకు టారిఫ్ సబ్సిడీ నిధులు విడుదల చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. డిస్కంలకు టారిఫ్ సబ్సిడీ విడుదలకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీలోని కూటమి ప్రభుత్వం.. మూడు ప్రాంతాల్లోని విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ.4,470 కోట్లు విడుదల ద్వారా వినియోగదారులకు బదలాయిస్తున్న టారిఫ్ సబ్సిడీ భరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి సర్కార్‌ నిర్ణయం తీసుకుంది.. 2025-26 ఏడాది తొలి త్రైమాసికానికి నిధులు విడుదలకు పాలనా అనుమతి మంజూరు చేసింది.. ప్రజలపై టారిఫ్ ల భారం పడకుండా సబ్సిడీ మొత్తం బదలాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. డిస్కంల ఖాతాల్లో మొత్తం జమ చేయాలని పవర్ కోఆర్డినేషన్ కమిటీకి ఆదేశాలు వెళ్లాయి.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్..

Read Also: Minister Gottipati Ravikumar: ఇసుక దోపిడీ కోస‌మే గుండ్లక‌మ్మ గేట్లను విర‌గొట్టారు.. మంత్రి సంచలన ఆరోపణలు

Exit mobile version