తెలంగాణలో మరో కొత్త డిస్కమ్ ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఉన్న రెండు డిస్కమ్‌లకు ప్రత్యామ్నాయంగా మూడో డిస్కమ్ ఏర్పాటుకు ఆమోదం లభించింది. మూడో డిస్కమ్ ఏర్పాటుకు విద్యుత్ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: Himachal Pradesh Video: లోతైన లోయలో పడిపోబోయిన వ్యాన్.. తర్వాత ఏమైందంటే..!
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, వినియోగదారులకు నాణ్యమైన, విశ్వసనీయ విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం టీఎస్‌ఎస్‌పీడీసీఎల్, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ ద్వారా నిర్వహించబడుతున్న విద్యుత్ పంపిణీ వ్యవస్థలో భాగంగా మూడవ డిస్కం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఇది కూడా చదవండి: Harish Rao: రాజ్యాంగంపై ఢిల్లీలో ఉపన్యాసాలు.. తెలంగాణలో ఇంకొక వైఖరా?
వ్యవసాయం తదితర వర్గాలకు ఉచిత, సబ్సిడీ విద్యుత్ అందించడంతో పాటు సగటు బిల్లింగ్ రేటు, సేవల వ్యయం మధ్య ఉన్న వ్యత్యాసం కారణంగా డిస్కాంల ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్‌డీఎస్‌ఎస్ వంటి కేంద్ర పథకాల అమలు సులభతరం చేయడం లక్ష్యంగా మూడవ డిస్కం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
