Gottipati Ravi: ఏపీ విద్యుత్ శాఖ మంత్రిగా గొట్టిపాటి రవి బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని 3వ బ్లాక్‌లో బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విద్యుత్ వ్యవస్థ మీద చాలా పట్టు ఉందని, ఆయన ఈ రంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారన్నారు. రాష్ట్రంలో డిమాండ్ సప్లైపై దృష్టి సారిస్తున్నామన్నారు. త్వరలోనే డిపార్ట్మెంట్‌తో కూర్చొని పూర్తి స్థాయి సమీక్ష చేస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ది కోసం మనమందరం కలిసికట్టుగా పని చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించిన గొట్టిపాటి రవిని మంత్రి అనగాని సత్యప్రసాద్, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమాట్ల ధర్మరాజు, రాజమండ్రి ఎంఎల్ఏ ఆదిరెడ్డి వాసులు అభినందించారు.
Read Also: Nara Lokesh: అసెంబ్లీ లాబీలో మంత్రి నారా లోకేష్ చిట్ చాట్