NTV Telugu Site icon

Gopichand32 : గోపిచంద్ సినిమాలోకి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ..

Gopi (2)

Gopi (2)

మ్యాచో స్టార్ గోపీచంద్ ఇటీవల భీమా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. గతంలో వచ్చిన రామబాణం ప్రేక్షకులను నిరాశ పరచినా ఈ ఏడాది భీమా అలరించింది.. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ప్రస్తుతం గోపీచంద్, శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది..

ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ మరియు ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి యొక్క తొలి నిర్మాణ సంస్థ. ఈ ప్రాజెక్ట్ ను చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై అత్యున్నత స్థాయి ప్రొడక్షన్ మరియు సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.. టాలీవుడ్ ప్రసిద్ధ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా కోసం చిత్రాలయం స్టూడియోస్‌తో కలిసి పని చేస్తుంది. టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా చేరారు..

నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ – పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాంటి పెద్ద బ్యానర్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. విశ్వప్రసాద్ గారికి ధన్యవాదాలు. సినిమా బాగా వస్తోంది. 27 నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. శ్రీను వైట్ల మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఈ సినిమాకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సినిమాతో శ్రీను వైట్ల మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. గోపీచంద్, శ్రీనువైట్ల కాంబో సినిమా పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు..

ఇక ఈ సినిమాలో గోపీచంద్‌ని సరికొత్త లుక్ లో శ్రీను వైట్ల చూపించునున్నారు . శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే రాశారు. కెవి గుహన్ కెమెరా క్రాంక్ చేయనుండగా, చైతన్ భరద్వాజ్ సంగీత విభాగానికి హెల్మ్ చేయనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి..