Site icon NTV Telugu

Ramabanam 1st Day Collection : గోపీచంద్ ‘రామబాణం’తో ఫస్ట్ డే ఎన్ని కోట్లు కొల్లగొట్టాడంటే ?

Ramabanam

Ramabanam

Ramabanam 1st Day Collection : మ్యాచో స్టార్ గోపీచంద్, డింపుల్ హయతీ జంటగా నటించిన తాజా చిత్రం రామబాణం. మాస్ యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న గోపీచంద్.. చాలా కాలంగా పెద్ద హిట్ కోసం చూస్తున్నాడు. గోపీచంద్ కు రామబాణం సినిమా మంచి విజయం తెచ్చిపెట్టాలని ఆయన ఫ్యాన్స్ కూడా అనుకున్నారు. సినిమా శుక్రవారం విడుదలై మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. గతంలో తనకు లక్ష్యం, లౌక్యం వంటి మంచి హిట్స్ అందించి శ్రీవాసు డైరెక్షన్లో ఈ రామబాణం సినిమా తెరకెక్కింది. ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఉన్నా పాజిటివ్ టాక్ తెచ్చుకోలేదు. ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి కలెక్షన్స్ ని అందుకుందో ఓ సారి చూద్దాం.

Read Also: MP Margani Bharat: చంద్రబాబు సవాల్‌.. వాలంటీర్‌ వ్యవస్థ రద్దుపై బహిరంగంగా చెప్పగలవా..?

రామబాణం సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 840 థియేటర్లలో సినిమా విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 620కి పైగా థియేటర్లలో రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద రామబాణం 14.5 కోట్ల రేంజ్‌లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 15.20 కోట్లుగా ఫిక్స్ చేసింది. తొలిరోజు రామబాణం సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. అనుకున్న స్థాయిలో థియేటర్లలో ఆక్యుపెన్సీ నమోదు కాలేదు. థియేటర్ ఆక్యుపెన్సీ మార్నింగ్ షోలకు 18.72%, మధ్యాహ్నం షోలకు 22.83% మరియు ఈవినింగ్ షోలకు 20.61% నమోదైంది. ఇక నైట్ షోలకు కూడా లెక్కలు పెరిగినట్లు తెలుస్తోంది.

Read Also: Stephen raveendra: గోవాలో 7 వేలకు కొని… హైదరాబాద్ లో 18 వేలకు అమ్ముతున్నారు.. సీపీ వెల్లడి

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రామబాణం సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. మొదటి రోజు 1.5 కోట్ల నుండి 1.8 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ సాధించే ఛాన్స్ ఉంది. అయితే ఇండియా మొత్తం మీద చూస్తే ఈ సినిమా 4 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. సినిమాకు ఈ స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయని ఎవరూ ఊహించలేదు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే రామబాణం సినిమా దాదాపు 5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంది.

Exit mobile version