Viswam OTT : హీరో గోపీచంద్ నటించిన తాజా చిత్రం విశ్వం.. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు ముందు హీరో గోపిచంద్, డైరెక్టర్ శ్రీను వైట్ల ఇద్దరూ ఫ్లాప్ ఫేస్ లో ఉన్నారు. గోపీచంద్ కి ఇటీవల ఒకటి రెండు పర్వాలేదు అని అనిపించే సినిమాలు పడ్డాయి కానీ, శ్రీను వైట్ల హిట్ సినిమా తీసి దాదాపు పదేళ్లకు పైనే అయింది. ఎన్టీఆర్ బాద్ షా సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు. విశ్వంతో శ్రీను వైట్ల కమ్ బ్యాక్ ఇచ్చినట్లే అనిపిస్తోంది.. ఇక తాజాగా ఈ మూవీ ఓటీటీ అప్డేట్ గురించి మరో వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.
Read Also:Asia Cup 2024: అక్టోబర్ 19న భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా తిలక్ వర్మ!
డైరెక్టర్ శ్రీను వైట్ల 2018 లో రవితేజ తో ఆయన తీసిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత ఆయన సినిమాలు చేయలేదు. భారీ గ్యాప్ తీసుకొని విశ్వం చిత్రంతో వచ్చారు. రొటీన్ చిత్రం అనిపించినప్పటికీ, కామెడీ వర్కౌట్ అవ్వడంతో దసరా హాలిడేస్ వరకు నెట్టుకొచ్చింది.. దసరా పండగ గోపి చంద్ కు మంచిగానే వర్కవుట్ అయింది. ఇక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కు భారీగానే రాబట్టిందనే టాక్ వినిపిస్తుంది. ఇక ఈ మూవీ ఓటీటీ పై ఓ వార్త వినిపిస్తుంది.
Read Also:Rape On Dead Body: ఛీ.. ఛీ.. సమాధి నుండి బాలిక మృతదేహాన్ని తీసి అత్యాచారం చేసిన యువకులు
ఈ సినిమా డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ రూ.12 కోట్లకు కొనుగోలు చేసింది. గోపీచంద్ హిందీ డబ్బింగ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తాయి. అందుకే ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా భారీ రేట్ కి కొనుగోలు చేశారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది. ముందుగా అనుకున్న దాని ప్రకారం ఈ మూవీని దీపావళీ కానుకగా ఓటీటీ లో స్ట్రీమింగ్ కు తీసుకురావాలని కానీ అక్టోబర్ 29 , లేదా నవంబర్ 3న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు వినికిడి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. అయితే సినిమా థియేటర్స్ లో విడుదలై వారం రోజులు కూడా పూర్తి కాకముందే ఓటీటీ విడుదల తేదీ లీక్ అవ్వడం వల్ల సినిమా థియేట్రికల్ రన్ పై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.