NTV Telugu Site icon

Google Bard: చాట్‌జీపీటీకి షాక్..గూగుల్ ‘బార్డ్’ వచ్చేస్తోంది

Su

Su

ఆన్‌లైన్ సర్చ్ ఇంజిన్‌ ప్లాట్‌ఫామ్‌లో గూగుల్‌కు సరైన పోటీ కనిపించడం లేదు. ఇటీవల ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ రూపంలో దానికి దీటుగా నిలబడే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (కృత్తిమ మేధ)తో పనిచేసే ఓ ప్లాట్‌ఫామ్ తెరపైకి వచ్చింది. దీంతో గూగుల్‌కు చెక్ తప్పదంటూ కొందరు అభిప్రాయపడ్డారు. కానీ దీన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు సుందర్‌ పిచాయ్‌ నేతృత్వంలోని గూగుల్‌ సిద్ధమవుతోంది. మైక్రోసాఫ్ట్‌ తెరతీసిన యుద్ధానికి గూగుల్‌ కూడా సన్నాహాలు చేసుకుంటోంది. ‘బార్డ్‌ (Bard)’ పేరిట ఏఐ ఆధారిత చాట్‌బోట్‌ను సిద్ధం చేస్తోంది.

Also Read: Nahida Quadri: యూట్యూబర్‌కి భర్త వేధింపులు.. మరొకరితో చనువుగా ఉంటూ..

ప్రస్తుతం బార్డ్‌ను టెస్టింగ్‌ కోసం కొందరికి మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సుందర్‌ పిచాయ్‌ సోమవారం ఓ బ్లాగ్‌ పోస్ట్‌లో తెలిపారు. ప్రయోగాత్మకంగా పరీక్షించిన తర్వాత ఈ ఏడాదిలోనే దీన్ని విస్తృత స్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామని వెల్లడించారు. క్లిష్టమైన అంతరిక్ష ఆవిష్కరణలను చిన్న పిల్లలకు సైతం బార్డ్‌ చాలా సులభంగా అర్థమయ్యేలా వివరిస్తుందని గూగుల్ పేర్కొంది. విందు ఏర్పాటుకు కావాల్సిన ప్రణాళిక, ఇంట్లోని రిఫ్రిజిరేటర్‌లో ఉన్న కూరగాయల ఆధారంగా భోజనానికి ఏం వండుకోవచ్చు.. వంటి చిట్కాలను సైతం బార్డ్‌ అందించగలుగుతుందని పేర్కొంది.

Also Read: WPL 2023: విమెన్స్ లీగ్ ప్రారంభం ఆరోజే..ఐపీఎల్ ఛైర్మన్ ప్రకటన

చాట్‌జీపీటీని ఓపెన్‌ఏఐ అనే కృత్రిమ మేధ సంస్థ రూపొందించింది. ఓపెన్‌ఏఐలో మైక్రోసాఫ్ట్‌ 2019లోనే 1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఇటీవల మరిన్ని నిధులను ఓపెన్‌ఏఐకి అందించనున్నట్లు ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన గూగుల్‌.. బార్డ్‌కుకు సంబంధించిన ప్రకటన చేసింది. తమ కంపెనీలో కృత్రిమ మేధపై పనిచేస్తున్న ఇంజినీర్లనూ అప్రమత్తం చేసింది. చాట్‌జీపీటీకి పోటీనిచ్చేలా బార్డ్‌ డెవలప్‌మెంట్‌ను వేగవంతం చేయాలని సూచించింది.