Google Bard: చాట్‌జీపీటీకి షాక్..గూగుల్ ‘బార్డ్’ వచ్చేస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆన్‌లైన్ సర్చ్ ఇంజిన్ ప్లాట్‌ఫామ్‌లో గూగుల్‌కు సరైన పోటీ కనిపించడం లేదు. ఇటీవల ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ రూపంలో దానికి దీటుగా నిలబడే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (కృత్తిమ మేధ)తో పనిచేసే ఓ ప్లాట్‌ఫామ్ తెరపైకి వచ్చింది. దీంతో గూగుల్‌కు చెక్ తప్పదంటూ కొందరు అభిప్రాయపడ్డారు. కానీ దీన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు సుందర్ పిచాయ్ నేతృత్వంలోని గూగుల్ సిద్ధమవుతోంది. మైక్రోసాఫ్ట్ తెరతీసిన యుద్ధానికి గూగుల్ కూడా సన్నాహాలు చేసుకుంటోంది. ‘బార్డ్ (Bard)’ పేరిట ఏఐ ఆధారిత చాట్‌బోట్‌ను సిద్ధం చేస్తోంది.
Also Read: Nahida Quadri: యూట్యూబర్‌కి భర్త వేధింపులు.. మరొకరితో చనువుగా ఉంటూ..
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
ప్రస్తుతం బార్డ్‌ను టెస్టింగ్ కోసం కొందరికి మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సుందర్ పిచాయ్ సోమవారం ఓ బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు. ప్రయోగాత్మకంగా పరీక్షించిన తర్వాత ఈ ఏడాదిలోనే దీన్ని విస్తృత స్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామని వెల్లడించారు. క్లిష్టమైన అంతరిక్ష ఆవిష్కరణలను చిన్న పిల్లలకు సైతం బార్డ్ చాలా సులభంగా అర్థమయ్యేలా వివరిస్తుందని గూగుల్ పేర్కొంది. విందు ఏర్పాటుకు కావాల్సిన ప్రణాళిక, ఇంట్లోని రిఫ్రిజిరేటర్‌లో ఉన్న కూరగాయల ఆధారంగా భోజనానికి ఏం వండుకోవచ్చు.. వంటి చిట్కాలను సైతం బార్డ్ అందించగలుగుతుందని పేర్కొంది.
Also Read: WPL 2023: విమెన్స్ లీగ్ ప్రారంభం ఆరోజే..ఐపీఎల్ ఛైర్మన్ ప్రకటన
చాట్‌జీపీటీని ఓపెన్‌ఏఐ అనే కృత్రిమ మేధ సంస్థ రూపొందించింది. ఓపెన్‌ఏఐలో మైక్రోసాఫ్ట్ 2019లోనే 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఇటీవల మరిన్ని నిధులను ఓపెన్‌ఏఐకి అందించనున్నట్లు ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన గూగుల్.. బార్డ్‌కుకు సంబంధించిన ప్రకటన చేసింది. తమ కంపెనీలో కృత్రిమ మేధపై పనిచేస్తున్న ఇంజినీర్లనూ అప్రమత్తం చేసింది. చాట్‌జీపీటీకి పోటీనిచ్చేలా బార్డ్ డెవలప్‌మెంట్‌ను వేగవంతం చేయాలని సూచించింది.
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!