NTV Telugu Site icon

Google Pixel 7 : పిక్సెల్‌ 7, పిక్సెల్‌ 7 ప్రొ భారత్‌లో గ్రాండ్‌ ఎంట్రీ

Google Pixel

Google Pixel

గూగుల్‌ తన ఫ్లాగ్‌షిప్‌ పిక్సెల్‌ ఫోన్లను భారత విపణిలోకి ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. పిక్సెల్‌ 7, పిక్సెల్‌ 7 ప్రొ భారత్‌లో గ్రాండ్‌ ఎంట్రీ ఇస్తాయని ప్రకటించింది కంపెనీ. త్వరలోనే అధికారిక లాంఛ్‌ డేట్‌ను గూగుల్‌ వెల్లడిస్తుందని, ఈ హాట్‌ డివైజ్‌లు అక్టోబర్‌ 6న గ్లోబల్‌ మార్కెట్లలోకి రానుండగా భారత్‌ మార్కెట్‌లోకి వాటి ఎంట్రీ, ధరల వివరాలను గూగుల్‌ తర్వాత ప్రకటించనుంది. లాంఛ్‌ ఈవెంట్‌కు ముందుగా పిక్సెల్‌ 7 సిరీస్‌ ధరలు మార్కెట్‌లోకి లీకయ్యాయి. పిక్సెల్‌ 7 సిరీస్‌ రూ 48,580, పిక్సెల్‌ 7 ప్రొ ధర దాదాపు రూ 72,910 ఉండవచ్చని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక భారత్‌లో గూగుల్‌ చాలా కాలం కిందట తన ఫ్లాగ్‌షిప్‌ సిరీస్‌ ఫోన్‌లను నిలిపివేసే ముందు చివరిసారిగా పిక్సెల్‌ ౩ సిరీస్‌తో ముందుకొచ్చింది.

 

భారత్‌ మార్కెట్‌లో పిక్సెల్‌ 4, పిక్సెల్ 5, పిక్సెల్‌ 6ను తప్పించిన అనంతరం తాజాగా పిక్సెల్‌ 7 సిరీస్‌ను ఇక్కడ లాంఛ్‌ చేయనుంది గూగుల్‌. మరోవైపు అమెరికా ధరలతో పోలిస్తే భారత్‌ మార్కెట్‌లో పిక్సెల్‌ 7 ధరలు అధికంగా ఉంటాయని భావిస్తున్నారు ఐఫోన్‌ అభిమానులు. గతంలో పిక్సెల్‌ 6ఏ అమెరికాలో రూ 36,417కు లాంఛ్‌ చేయగా భారత్‌లో మాత్రం రూ 43,999 ప్రారంభ ధరకు లాంఛ్‌ చేశారు. అదే మాదిరిగా పిక్సెల్‌ 7 సిరీస్‌ కూడా అమెరికా ప్రైస్‌తో పోలిస్తే భారత్‌లో ధర అధికంగా ఉంటుందని భావిస్తున్నారు టెక్‌ దిగ్గజాలు అంటున్నారు.