Google Maps: గూగుల్ మ్యాప్‌ను నమ్మితే నట్టేట ముంచింది.. ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు!
- చిత్తోర్‌గఢ్ జిల్లాలో భారీ ప్రమాదం
- గూగుల్ మ్యాప్‌ను నమ్మితే నట్టేట ముంచింది
- ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తోర్‌గఢ్ జిల్లాలో ఒక భారీ ప్రమాదం జరిగింది. రాజ్‌సమంద్ జిల్లాలోని గదరి వర్గానికి చెందిన ఒక కుటుంబం గూగుల్ మ్యాప్‌పై ఆధారపడి తిరిగి వస్తుండగా బనాస్ నదిలో కొట్టుకుపోయారు. వ్యాన్‌లో ఉన్న తొమ్మిది మందిలో ఐదుగురిని గ్రామస్తుల సాయంతో పోలీసులు రక్షించారు. ఈ ఘటనలో ఒక బాలిక మరణించింది. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. రష్మి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని సోమి-ఉప్రెడా కల్వర్టు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ కల్వర్టు మూడు సంవత్సరాలుగా మూసివేసి ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా దానిపై నీరు ప్రవహిస్తోంది. ఇది గమనించకుండా వెళ్లిన వాహనం ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Snake Bit: పాము కాటుకు బూత వైద్యుడితో చికిత్స.. 7 గంటల తర్వాత ఆస్పత్రికి! చివరికి ఏమైందంటే?
Also Read
- Pak vs WI: వెస్టిండీస్‌పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
కనఖేడాకు చెందిన ఈ కుటుంబం భిల్వారా జిల్లాలోని సవాయి భోజ్‌ను సందర్శించడానికి వెళ్ళింది. తిరిగి వచ్చే క్రమంలో వారు గూగుల్ మ్యాప్ ద్వారా ఇంటికి తిరిగి వెళ్ళే మార్గాన్ని సెర్చ్ చేశారు. ఆ మ్యాప్ వారిని సోమి-ఉప్రెడా కల్వర్ట్ వైపు మళ్లించింది. అది చాలా రోజులుగా మూసివేసిన మార్గాన్ని సూచించింది. పొరబడిన డ్రైవర్ వ్యాన్‌ను కల్వర్ట్ మీదుగా తీసుకెళ్లాడు. అక్కడ వ్యాన్ ఒక గొయ్యిలో చిక్కుకుంది. ఇంతలోనే వేగంగా వచ్చిన ప్రవాహానికి వ్యాను కొట్టుకుపోయింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గ్రామస్తులు, సహాయక బృందాలు పడవల సహాయంతో ఐదుగురిని రక్షించారు. వ్యాన్‌లో ఉన్న తొమ్మిది మంది బంధువులు గదరి వర్గానికి చెందినవారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం తర్వాత గూగుల్ మ్యాప్స్‌పై గుడ్డి నమ్మకం పెట్టుకోవద్దని పలువురు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Raaka: ‘రాకా’లో షారుఖ్ ఉన్నారా? వైరల్ అవుతున్న గెస్ట్ రోల్ వార్తలపై క్లారిటీ!
-
Pak vs WI: వెస్టిండీస్‌పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
-
Oppo F35 Pro: ఒప్పో F35 ప్రో భారత్ లో రిలీజ్ కు రెడీ.. 10,000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫోన్!
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్‌లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్‌కు రంగం సిద్ధం!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!