NTV Telugu Site icon

Youtube: యూట్యూబ్ ప్రీమియం ప్లాన్‌ల ధరలను పెంచిన గూగుల్..

Youtube

Youtube

Youtube Premium Plans: టెక్ దిగ్గజం గూగుల్ ఇండియాలో యూట్యూబ్ ప్రీమియం ప్లాన్‌ల ధరలను తాజాగా పెంచింది. యూట్యూబ్ (YouTube) ప్రీమియం ప్లాన్‌ల ధరలు దాదాపు 58 శాతం వరకు పెరిగాయి. అయితే., ఈ ప్లాట్‌ఫామ్ ఇప్పటికీ కొంతమంది కొత్త వినియోగదారులకు యూట్యూబ్ ప్రీమియంకు ఉచిత సభ్యత్వాన్ని అందిస్తోంది. యూట్యూబ్ ప్రీమియం అనేది గూగుల్ అందించే సేవ. ఈ ప్లాట్‌ఫామ్‌లో యాడ్ రహిత వీడియోలను చూడటానికి వినియోగదారులను అనుమతిస్తుంది. యూట్యూబ్ ప్రీమియం ప్లాన్‌లు ఇప్పుడు విద్యార్థుల కోసం రూ. 89 (నెలవారీ) నుండి ప్రారంభమవుతాయి. అయితే., వ్యక్తిగత ప్లాన్ ఇప్పుడు మీకు రూ. 149 ఖర్చు అవుతుంది. ఇంతకు ముందు విద్యార్థి, వ్యక్తిగత ప్లాన్ ధరలు వరుసగా రూ. 79, రూ. 129గా ఉన్నాయి. ఇక ఫ్యామిలీ ప్లాన్ ధర భారీగా పెరిగింది. ఇంతకుముందు ఈ ప్లాన్ ధర రూ. 189 ఉండగా, పెరిగిన తర్వాత.. దీని ధర రూ. 299గా మారింది.

Bigg BossTelugu 8: బిగ్‌బాస్‌ 8 ప్రసార తేదీ వచ్చేసింది.. హోస్ట్‌గా కింగే!

ఇక మరోవైపు వార్షిక ప్లాన్ల ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది. ఇంతకుముందు రూ. 1,290 గా ఉన్న వార్షిక ప్లాన్‌కు ఇప్పుడు వినియోగదారు రూ. 1,490 చెల్లించాల్సి ఉంటుంది. 3 నెలల ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు రూ. 459, నెలవారీ ప్రీపెయిడ్ రూ. 159కి అందుబాటులో ఉంది. యూట్యూబ్ ప్రీమియం సభ్యత్వం కూడా తర్వాత ఆఫ్‌లైన్‌లో వీడియోలను చూడటానికి, డౌన్‌లోడ్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.