NTV Telugu Site icon

Google I/O 2025: వర్చువల్ ట్రై-ఆన్, ధరల ట్రాకింగ్, సులభమైన చెల్లింపులు.. షాపింగ్ కోసం కొత్త ఏఐ మోడ్..!

Google Io 2025

Google Io 2025

Google I/O 2025: గూగుల్ I/O 2025 ఈవెంట్‌లో గూగుల్ తన వినియోగదారుల కోసం కొత్త ఏఐ ఆధారిత షాపింగ్ అనుభవాన్ని ప్రవేశపెట్టింది. ఇది జెమినీ ఏఐ సామర్థ్యాలను గూగుల్ షాపింగ్ గ్రాఫ్‌తో కలిపి వినియోగదారులకు స్పష్టమైన సమాచారం, వ్యక్తిగతీకరించిన సూచనలు, వర్చువల్ ట్రై-ఆన్ వంటి ఆకర్షణీయ ఫీచర్లతో సరళమైన కొనుగోలు ప్రక్రియను అందించనుంది. గూగుల్ ప్రవేశపెట్టిన ఏఐ మోడ్ షాపింగ్ ఫీచర్ గెమినీ ఏఐ, షాపింగ్ గ్రాఫ్ పై ఆధారపడి ఉంటుంది. ఈ గ్రాఫ్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50 బిలియన్‌కి పైగా ఉత్పత్తుల లిస్టింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ గంటకు ఒకసారి అప్డేట్ అవుతూ.. రోజుకు 2 బిలియన్ల వస్తువులను అప్డేట్స్‌ చేస్తుంది. ఇవి ధరలు, కలర్స్, స్టాక్ లభ్యత, రివ్యూలు వంటి వివరాలతో సహా ఉంటాయి.

Read Also: Pakistan: మరోసారి బయటపడ్డ పాక్ సైన్యం, ఉగ్రవాద సంస్థల మధ్య సంబంధం!

ఇందులో ఉదాహరణకు “Baby Toy” అని వెతికితే, గూగుల్ ఏఐ మోడ్ వినియోగదారుడి అభిరుచుల ఆధారంగా చిత్రాలతో కూడిన ఫలితాలను చూపిస్తుంది. ఏఐ మోడ్ పిల్లలుఏ వయసుకు సంబంధించిన వారు? ఎలాంటి రకమైన ఆట వస్తువులు కావాలి? ఎంత ధరలో కావాలి..? ఇలా వివిధ రకాల ఖచ్చితమైన రిప్లై ని అందజేస్తుంది. అలాగే వివిధ సూచనలు కూడా ఇస్తుంది. ఇక అక్కడ Track price బటన్‌ను క్లిక్ చేసి మీ సైజ్, రంగు, బడ్జెట్‌ను ఎంపిక చేయవచ్చు. అంతేకాదండోయ్.. ధర తగ్గినపుడు అలర్ట్ కూడా వస్తుంది. ఆపై గూగుల్ పే ద్వారా మర్చంట్ సైట్‌పై త్వరితంగా, భద్రతగా లావాదేవీ పూర్తవుతుంది.

Read Also: Yash Mother : యశ్‌ తో మూవీ చేయను.. వాడికి ఆ విలువ తెలియదు..

ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ఫోటోను అప్‌లోడ్ చేసి బిలియన్ల దుస్తులను వర్చువల్‌గా ట్రై చేయవచ్చు. గూగుల్ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఇమేజ్ జనరేషన్ మోడల్ ఇది. ఇది బాడీ షేప్‌లను, దుస్తుల ముడతలు ఇంకా అనేక వివరాలను విశ్లేషించి మన చిత్రాలను ఆ దుస్తులలో ఎలా ఉంటుందో చూపుతుంది. ఇక Search Labsలో షర్ట్స్, ప్యాంట్స్, స్కర్ట్స్, డ్రెస్సెస్ కోసం షాపింగ్ చేసే వినియోగదారులు “Try it on” ఐకాన్‌ను టాప్ చేసి తమ ఫోటోపై దుస్తులు ఎలా సరిపోతాయో చూడవచ్చు. వీటిని సేవ్ చేయడం, షేర్ చేయడం కూడా చేయొచ్చు.

ఈ AI మోడ్ షాపింగ్, ఆగెంటిక్ చెక్ అవుట్ ఫీచర్లు అమెరికాలో వచ్చే కొన్ని నెలల్లో అందుబాటులోకి రానున్నాయి. వర్చువల్ ట్రై-ఆన్ ఫీచర్ ప్రస్తుతం అమెరికాలో Search Labs ద్వారా అందుబాటులో ఉంది. గూగుల్ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ లిలియన్ రిన్‌కాన్ ప్రకారం, ఈ ఫీచర్లన్నీ వినియోగదారులు తక్కువ ధరల వద్ద సరైన సమయంలో నిర్ణయం తీసుకోవడంలో సహాయపడతాయని తెలిపారు.