NTV Telugu Site icon

Google Layoffs: టెక్కీలకు గూగుల్ షాక్.. మరో వెయ్యి మంది తొలగింపు..

Google

Google

Google: టెక్ దిగ్గజం గూగుల్ మరో దశ లేఆఫ్స్ కు పూనుకుంది. తాజా లేఆఫ్స్‌లో భాగంగా ఏకంగా 1000 మందిని విధుల నుంచి తొలగించినట్లు ఈ సెర్చింజ‌న్ దిగ్గజం పేర్కొనింది. కాగా, గూగుల్ హార్డ్‌వేర్‌, సెంట్రల్ ఇంజనీరింగ్ టీమ్స్, గూగుల్ అసిస్టెంట్ స‌హా ప‌లు విభాగాల్లో కొలువులకు కంపెనీ కోత పెట్టింది. లేఆఫ్స్ గురించి ముంద‌స్తు స‌మాచారం ఇవ్వకపోయింనందుకు బాధపడుతున్నాం.. ఈ కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సివ‌చ్చింద‌ని బాధిత ఉద్యోగుల‌కు గూగుల్ కంపెనీ ఈమెయిల్‌లో తెలిపింది.

Read Also: Supreme Court: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌.. సుప్రీంకోర్టులో కీలక పరిణామం

ఇక, అర్హులైన ఎంప్లయ్స్ కు ప‌రిహార ప్యాకేజ్ వ‌ర్తింప‌చేస్తామ‌ని గూగుల్ తెలియజేసింది. ఇత‌ర విభాగాల్లో ఎంపిక చేసిన అవ‌కాశాల‌కు వేటుకు గురైన ఉద్యోగులు తిరిగి ద‌ర‌ఖాస్తు చేసుకోచ్చని తెలిపింది. కంపెనీలో తిరిగి ఛాన్స్ దక్కని ఉద్యోగులు ఏప్రిల్‌లో కంపెనీని వదిలి పెట్టాలని చెప్పింది. ఇక, 2023లోనే పలు టెక్ సంస్థలు భారీగా ఉద్వాసనలు పలికాయి.. తాజాగా ఈ సంవత్సరంలోనూ అదే ఒరవడిని కొనసాగిస్తున్నాయి.

Read Also: TS Government: పశుసంవర్దక శాఖ కార్యాలయంలో ఫైళ్ల మాయంపై కేసు.. ఏసీబీకి బదిలీ

అయితే, ఈ నెల 15 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 48 టెక్ కంపెనీలు 7 వేల 528 మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయని లే-ఆఫ్ ట్రాకింగ్ వెబ్ సైట్ లే-ఆప్స్.ఎఫ్‌వైఐ వెల్లడించింది. ఈ ఉద్వాసనలు 2024లోనూ కఠిన నిర్ణయాలకు దారి తీస్తాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 2023లో 1150కి పైగా టెక్ కంపెనీలు 2.60 లక్షల మందికి పైగా ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు ఇచ్చేశాయి.