Site icon NTV Telugu

Sundar Pichai: ఏఐ ఏజెంట్ మోడ్ ను ప్రవేశపెట్టిన గూగుల్.. అద్దె ఇల్లు వెతకడం ఇక ఈజీ..

Ai

Ai

ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ తో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఏఐ యాంకర్స్, ఏఐ డాక్టర్స్ ఇలా ప్రతీ రంగంలో ఏఐ వినూత్న ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. సేవలను మరింత సులభతరం చేసేందుకు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది గూగుల్. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సరికొత్త ఏజెంట్ మోడ్ ను ప్రవేశపెట్టారు. దీని సాయంతో అద్దె ఇల్లు వెతుక్కోవడం సులభంగా మారుతోంది. అద్దె ఇళ్లు వెతకడం కోసం ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. దీని ద్వారా యూజర్లు జెమిని ఏఐతో వివిధ పనులు చేయించుకోవచ్చు. నిర్దిష్ట ప్రాంతంలో, నిర్దిష్ట ధరలో అద్దెకు ఇళ్లను వెతకడం వంటి పనులు కూడా ఇది చేస్తుంది. ఈ సాధనం వెబ్ లో స్వయంగా శోధించి ఫలితాలను అందిస్తుంది. దీని ద్వారా యూజర్లు ప్రాజెక్టు మారినర్ ఉపయోగించి వాటిని బుక్ కూడా చేసుకోవచ్చు.

Also Read:Balagam : బలగం సినిమా రిపీట్.. 60 ఏళ్ల వయసులో పంతాలు విడిచి అన్నదమ్ములు..

గూగుల్ షాపింగ్ కోసం కొత్త ఫీచర్లను కూడా ప్రకటించింది. AI సహాయంతో, మీరు మీ ఫోటోలలో దేనినైనా ఉపయోగించి ఒక డ్రెస్ మీపై ఎలా కనిపిస్తుందో చూడవచ్చు. మీ అవసరాలు, బడ్జెట్ ప్రకారం Google సెర్చ్ అన్ని వెబ్‌సైట్‌లను ట్రాక్ చేస్తుంది. మీకు సమాచారాన్ని అందిస్తుంది. AI ఏజెంట్ మీ కోసం ఇవన్నీ చేస్తుంది. AI ఏజెంట్ మీ కోసం షాపింగ్ చేస్తుంది. మీరు Google Veo లో అనేక కొత్త ఫీచర్లను చూడొచ్చు. దీని సహాయంతో, మీరు మీ ఫోటోలను జోడించడం ద్వారా వీడియోలను సృష్టించొచ్చు. మీరు ఫోటోలు, ప్రాంప్ట్‌లను ఉపయోగించి వీడియోలను సృష్టించొచ్చు.

Exit mobile version