Site icon NTV Telugu

Sri Sathyasai District: పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Train

Train

రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మానవతప్పిదాలు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రైలు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ పూర్తి స్థాయిలో ప్రమాదాలకు అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. పెనుగొండ కియా ఫ్యాక్టరీ దగ్గర గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Also Read:IPL 2025 Predictions: మాజీ క్రికెటర్ల ప్లేఆఫ్స్ ప్రిడక్షన్స్.. సన్‌రైజర్స్‌కు ఏకంగా 8 మంది మద్దతు!

రైలు పట్టాలు తప్పడంతో మిగతా రైళ్ల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు ప్రారంభించారు. క్రేన్ సహాయంతో గూడ్స్ రైలును తిరిగి పట్టాల పైకి చేరుస్తున్నారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం చోటుచేసుకోకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Exit mobile version