NTV Telugu Site icon

Goodachari 2 : కొత్త మిషన్ తో మొదలైన అడివి శేష్ గూఢచారి 2..

Adavishesh

Adavishesh

థ్రిల్లింగ్ సబ్జెక్ట్స్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు హీరో అడవి శేషు.. ఇటీవల వచ్చిన మేజర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు..గతంలో 2018లో వచ్చిన గూఢచారి సినిమా భారీ హిట్ ను అందుకుంది.. దీంతో ఇప్పుడు సీక్వెల్ గూఢచారి 2 అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా వినయ్ కుమార్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు..

ఈ సినిమాకు సంబందించిన ఫ్రీ ప్రొడక్షన్ పనులను కూడా టీమ్ మొదలు పెట్టేశారు..తాజాగా నేడు షూటింగ్ మొదలుపెట్టారు. కొన్ని రోజుల క్రితం గూఢచారి 2 ఫస్ట్ లుక్ కూడా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. నేడు ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టగా అడివి శేష్ ఫోటో ఒకటి, సెట్ నుంచి క్లాప్ బోర్డు ఫోటో ఒకటి షేర్ చేశారు చిత్రయూనిట్. ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. మన ఏజెంట్ 116 మళ్ళీ వచ్చాడు. ఈ సారి త్రినేత్ర అనే కొత్త మిషన్ తో వస్తున్నాడు. ఎంతోమంది వెయిట్ చేస్తున్న స్పై సీక్వెల్ గూఢచారి 2 ఈరోజు షూటింగ్ ను మొదలు పెట్టారు..

ఈ షూటింగ్ ను నిర్వీరామంగా పూర్తి చెయ్యనున్నట్లు మేకర్స్చెబుతున్నారు.. ఇక ఈ సినిమా అభిమానులు త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నారు. గూఢచారి 2 సినిమాపై భారీ అంచనాలు ఇప్పట్నుంచే నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారనేది ఇంకా ప్రకటించలేదు. వచ్చే ఏడాది ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు..