NTV Telugu Site icon

CM Chandrababu: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్ .. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు

Chandrababu

Chandrababu

CM Chandrababu: ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేస్తామని.. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపల్లి మండలం వానపల్లిలో గ్రామసభలో పాల్గొని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో 17500కిలో మీటర్లు సీసీ రోడ్లు వేస్తామన్నారు. మట్టి అంటకుండా బయటకు వెళ్లేలా చేస్తామన్నారు. 10వేల కిలోమీటర్లు మురికి కాల్వలు నిర్మిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఒక పద్ధతి ప్రకారం అభివృద్ది పనులు గ్రామాల్లో చేపడతామన్నారు. రీ సైక్లింగ్‌తో చెత్త ద్వారా సంపద క్రియేట్ చేస్తున్నామని చెప్పారు.

ప్రతి కుటుంబానికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమి ఇళ్ల స్థలంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికీ ఇళ్లు కట్టించే భాధ్యత తీసుకుంటున్నామని.. గత ఐదేళ్లుగా రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని మండిపడ్డారు. గత నాయకుడు ఏనాడైనా గ్రామ సభ పెట్టాడా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. జనంలోకి రావాలంటే పరదాలు,, చెట్లు నరికి వేయడం.. ఇదేమీ దారుణమంటూ విమర్శించారు. నరేగాలో ఎంతమందికి పని కావాల్సిన కల్పిస్తామన్నారు. రూ.4,550 కోట్లతో గ్రామీణ అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. 2019- 24 చీకటి రాజ్యం నడిచిందని.. నరేగ నిధులు దొంగ బిల్లులతో దోచుకున్నారని ఆరోపించారు.

Read Also: Jogi Rajeev: జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌కు ఏసీబీ కోర్టు బెయిల్

గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచ్ అని.. 97శాతం గెలిపించి బ్రహ్మరథం పట్టారన్నారు. రాష్ట్రంలో 990 కోట్లు పంచాయతీలకు విడుదల చేశామని.. మరికొన్ని నిధులు జారీ చేయనున్నామని తెలిపారు. నిర్ధిష్టమైన కార్యక్రమాల్లో ముందుకు వెళతామన్నారు. ల్యాండ్ టైటాలింగ్ యాక్ట్ రద్దు చేశామని చెప్పారు. పెన్షన్ల పంపిణీ సాధ్యం కాదన్నారు.. కానీ 4వేలకు పెంచి అందరికీ అందించామన్నారు. అక్టోబర్ నెలఖారు పూర్తిస్థాయిలో అన్న క్యాంటీన్ ప్రారంభిస్తామని సీఎం చెప్పారు.నైపుణ్యం లేక యువతకు ఉపాధి, ఉద్యోగాల కొరత ఏర్పడిందన్నారు. వ్యవసాయంలో పెట్టుబడి తగ్గించే ఆలోచన చేస్తున్నామన్నారుఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.రిజిస్ట్రేషన్ ద్వారా ఇంటికి పంపణీ ఏర్పాటు చేస్తామన్నారు. వీలైనంత త్వరలో పోలవరం ప్రాజెక్ట్‌ని పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. 1674 కోట్ల రూపాయలు రైతుల ధాన్యం బిల్లులు చెల్లించామని సీఎం పేర్కొన్నారు.