NTV Telugu Site icon

T.Nageswara Rao: నేతన్నలకు గుడ్ న్యూస్.. జౌళిశాఖ మంత్రి ప్రతిపాదనలకు సీఎం ఆమోదం

Tummala Nagewshwer Rao

Tummala Nagewshwer Rao

వ్యవసాయ, సహకార శాఖ, చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపాదించిన విషయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి మంత్రి తెలిపారు. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ కనుముక్కల నందు (23) ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (IIHT) నందు డిప్లొమా, డిగ్రీ ప్రోగ్రాంలలో విద్యార్థులకు ప్రవేశాల కల్పనకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని మంత్రి నాగేశ్వరరావు పేర్కొన్నారు. మరమగ్గాల, చేనేత మగ్గాల ఆధునీకరణ కొరకు బీసీ వెల్ఫేర్ శాఖ ద్వారా, నేతన్నలకు సహాయం.. 2024 -25 ఏడాదికి బీసీ వెల్ఫేర్ శాఖ ద్వారా కేటాయింపబడిన రూ.400 కోట్ల బడ్జెట్ వినియోగించుటకు సీఎం అంగీకరించినట్లు తెలిపారు.

READ MORE: Aadhaar Of Dead Person: మరణించిన వ్యక్తి ఆధార్ ఏమవుతుందో తెలుసా..

TSCO ద్వారా సానిటరీ నాప్కిన్లు ఉత్పతి పరిశ్రమను పోచంపల్లిలో స్థాపించుటకు అంగీకరించారని మంత్రి వెల్లడించారు. పాఠశాలలకు వెళ్ళే బాలికలకు ఋతుక్రమ సమయంలో పరిశుభ్రత పాటించడానికి, బడికి గైర్హాజరును నిరోధించడానికిగాను సానిటరీ నాప్కిన్లు స్వయం సహాయక సంఘాల ద్వారా సరఫరా చేయుటక నిశ్చయించామన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి TSCO కి రావాలసిన అన్ని పెండింగ్ బాకాయిలను విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని మంత్రి తెలిపారు. ఈ ప్రభుత్వం చేనేత కార్మికుల అభివృద్ధికి కట్టుబడి ఉందని, అలాగే వారి సంక్షేమం కోసం పాటు పడుతుందని ఈ సందర్భంగా మంత్రిగారు మరోమారు గుర్తుచేశారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఏడాదికి బీసీ వెల్ఫేర్ శాఖ ద్వారా కేటాయింపబడిన రూ.400 కోట్లు ఖర్చు చేసి వారి అభివృద్ధికి పాటుపడతామన్నారు.