Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లాలనుకుంటున్నారా? శ్రీ వేంకటేశ్వరుడి సేవలో తరించాలనుకుంటున్నారా? ఏడు కొండలు ఎక్కాలనుకుంటున్నారా? ఇప్పుడు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చింది.. శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). దర్శన టికెట్లు విడుదల చేసేందుకు సిద్ధమైంది.. ఇవాళ ఆన్‌లైన్‌లో అక్టోబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లను విడుదల చేయనున్నారు.. ఇక, ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు విడుదల కానుకండగా.. ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు, వసతి టికెట్లు.. మధ్యహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు.. ఆయా టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటున్న భక్తులు.. అలర్ట్‌గా ఉండి టికెట్లు బుక్ చేసుకోవాలి..
Read Also: Astrology: జూలై 24, సోమవారం దినఫలాలు
ఇక, రేపు ఆన్‌లైన్లో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ.. ఆగస్టు నెలతో పాటు సెప్టెంబర్ నెలకు సంబంధించిన అదనపు కోటా టికెట్లు విడుదల కానున్నాయి.. రోజుకి 4 వేల చొప్పున టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ.. అక్టోబర్ నెలకు సంబంధించి రోజుకి 15 వేల చొప్పున టికెట్లు విడుదల చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది.. ఏదేమైనా తిరుమల శ్రీవారికి సంబంధించిన ఏ టికెట్లకైనా ఫుల్ డిమాండ్ ఉంటుంది.. ఆన్‌లైన్‌లో పెట్టిన నిమిషాల వ్యవధిలోనే కోటా పూర్తియిన సందర్భాలు అనేకం. కావున.. భక్తులు అలర్ట్‌గా ఉండి టికెట్లు బుక్ చేసుకుంటే తప్ప.. దొరకని పరిస్థితి ఉంటుంది. మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.. 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ఇక, నిన్న శ్రీవారిని 87,792 మంది భక్తులు దర్శించుకున్నారు.. వారిలో 29,656 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.2 కోట్లుగా టీటీడీ ప్రకటించింది.
