NTV Telugu Site icon

IND vs AUS: టీమిండియా ఊపిరి పీల్చుకో.. టీంలోకి వచ్చేస్తున్న స్టార్ బౌలర్

Shami

Shami

IND vs AUS: ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాకు పెద్ద శుభవార్త అనే చెప్పాలి. స్టార్ ప్లేయర్ మహ్మద్ షమీ మళ్లీ రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. చీలమండకు గాయం కారణంగా దాదాపు ఏడాది పాటు జట్టుకు దూరమైన మహ్మద్ షమీ రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున ఆడేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం మధ్యప్రదేశ్‌తో జరిగే తమ తదుపరి రౌండ్ రంజీ మ్యాచ్‌లో షమీ బెంగాల్ తరఫున ఆడనున్నాడు. ఈ విషయాన్ని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. నిజానికి కర్ణాటకతో రంజీ నాలుగో రౌండ్ మ్యాచ్‌లో షమీ బరిలోకి దిగాల్సి ఉండగా, తగినంత శారీరక ఫిట్నెస్ లేకపోవడం వల్ల ఆడలేకపోయాడు.

Read Also: Donald Trump: కాలేజీల నుంచి రాడికల్ లెఫ్ట్, ఉన్మాదుల్ని తొలగిస్తా.. ట్రంప్ సంచలనం..

షమీ గాయం నుంచి పూర్తిగా కోలుకుని, అవసరమైన ఫిట్‌నెస్ సాధించిన తర్వాత బీసీసీఐ వైద్య బృందం బెంగాల్ తరఫున ఆడేందుకు అనుమతి నిచ్చింది. రంజీ ట్రోఫీలో తన లయను తిరిగి తెచ్చుకొని, మునుపటిలా రాణిస్తే, అతను ఆస్ట్రేలియాకు విమానం ఎక్కుతాడు. ఒకవేళ సిరీస్ మొదటి నుండి కుదరకపోయిన సిరీస్ మధ్యలో నుండైనా గవాస్కర్ ట్రోఫీలో పాల్గొంటాడు. గత ఏడాది నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో చివరిసారిగా భారత్ తరఫున ఆడిన మహ్మద్ షమీ, చిలిమండ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అప్పుడు అతనికి శస్త్రచికిత్స జరిగింది. దీంతో గతేడాది ఒక్క ఆట కూడా అడలేకపోయాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ఇటీవల మళ్లీ శిక్షణ ప్రారంభించిన మహ్మద్ షమీ, న్యూజిలాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ లేదా దక్షిణాఫ్రికాతో జరిగే టి20 సిరీస్‌కు తిరిగి వస్తాడని భావించారు. అయితే, ఈ రెండు సిరీస్‌లకు సెలక్షన్ కమిటీకి ఎంపిక చేయలేదు.

Read Also: Sivakarthikeyan : అమ’రన్’ ఇప్పట్లో ఆగేలా లేదు.. టార్గెట్ రూ. 300 కోట్లు

ఇటీవలే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో మహ్మద్ షమీ తన ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఫిట్‌నెస్ పరీక్షలో కూడా పాస్ అయ్యాడు. అంతర్జాతీయ మ్యాచ్‌కు ముందు దేశవాళీ క్రికెట్‌లో ఆడాలనుకుంటున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. రంజీ ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడిన తర్వాత.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో ఆడతానంటూ తెలిపాడు షమీ.