NTV Telugu Site icon

Andhra Pradesh: రాష్ట్ర ప్రజలకు శుభవార్త.. దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్లు

Gas

Gas

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా మహాశక్తి పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపింది. ఈ పథకంలో భాగంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వనుంది ప్రభుత్వం.. ఈ పథకం అమలుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.. తెల్లరేషన్ కార్డుదారులు 1.47 కోట్ల మంది ఉన్నారు. వీరికి సంవత్సరం 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తే రూ. 3640 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Read Also: IND vs NZ: టాస్ ఓడిపోవడం వల్లే గెలిచాం..- కివీస్ కెప్టెన్

ఈ పథకంపై మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. దీపావళి సందర్భంగా ప్రతి ఇంట్లో పండుగ వెలుగులు తీసుకొస్తామని అన్నారు. దీపావళి నుండి దీపం పథకంలో ఉన్న పేద కుటుంబాలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి.. సంవత్సరానికి మూడు వేల కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం.. కూటమి ప్రభుత్వంలో మంచి జరుగుతుందని మహిళలు పెద్ద ఎత్తున ఆశీర్వదించారన్నారు. అందుకే వారిని ఆశీర్వదించడానికి.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సూపర్ సిక్స్ పథకాల అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Read Also: Bangladesh: భారత్‌ షేక్ హసీనాని అప్పగించాలి, లేదంటే.. బంగ్లాదేశ్ వార్నింగ్..