15th Finance Commission: గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్.. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల

  • గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్
  • 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల
  • తొలి విడతగా రూ.259.36 కోట్లు
Money

Money

గ్రామ పంచాయితీలకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. తొలి విడతగా రూ.259.36 కోట్లు విడుదల చేసింది. ఈ మేరు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటికే నిధులు విడుదల కావాల్సి ఉండగా ఎన్నికల జాప్యంతో నిలిచిపోయాయి. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తికావడం, పంచాయతీ రాజ్ శాఖ అధికారుల సంప్రదింపులతో నిధుల విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం రూ.3000 కోట్ల వరకు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉంది. తొలి విడతగా రూ.259.36 కోట్లు విడుదలయ్యాయి.