NTV Telugu Site icon

IND vs ENG: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. తగ్గిన వర్షం, టాస్ ఆలస్యం

Ind

Ind

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా.. ఇండియా-ఇంగ్లండ్ మధ్య సెమీఫైనల్ జరుగనుంది. గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. రెండో సెమీఫైనల్ టాస్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు జరగాల్సి ఉండగా వర్షం కారణంగా ఆలస్యంగా వేయనున్నారు. ఈ మ్యాచ్ జరిగే గయానాలో ఇప్పటివరకూ వర్షం పడింది. తాజాగా వర్షం తగ్గడంతో.. అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. అయితే.. ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో టాస్ కొద్దిగా ఆలస్యం కానుంది. కాసేపటి తర్వాత గ్రౌండ్ ను పరిశీలించి టాస్, మ్యాచ్ ప్రారంభ సమయాన్ని ప్రకటించనున్నారు.

INDIA bloc: పార్లమెంట్ సమావేశాల్లో రేపు నీట్ అంశాన్ని లేవనెత్తనున్న ప్రతిపక్షం

రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు విజయ రథంపై దూసుకెళ్తోంది. భారత్ తన చివరి సూపర్-8 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌లోకి ప్రవేశించాలని భారత్‌ భావిస్తోంది. రోహిత్ బ్రిగేడ్ అడిలైడ్ నుండి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. అడిలైడ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ 2022 సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఇదెలా ఉంటే.. తొలి సెమీస్ లో దక్షిణాఫ్రికా ఆఫ్ఘనిస్తాన్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.

INDIA bloc: పార్లమెంట్ సమావేశాల్లో రేపు నీట్ అంశాన్ని లేవనెత్తనున్న ప్రతిపక్షం