ఆకు కూరల్లో రారాజు గోంగూర.. ఈ గోంగూరను అనేక రకాల వంటల్లో వాడుతారు.. ఎన్నో పోషకాలును కలిగి ఉంటుంది.. అందుకే గోంగూరను ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు.. మార్కెట్ లో ఎప్పుడూ డిమాండ్ ఉండటంతో ఎక్కువ మంది రైతులు గోంగూరను సాగు చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. వేసవిలో పండించే పంట.. వేరే ఆకూకూరల తో పోలిస్తే గోంగూర అధిక లాభాలను ఇచ్చే పంట..అందుకే ఇందులో విటమిన్లు, ప్రొటీన్లు, ఇనుము పుష్కలంగా ఉంటాయి. నీటి వసతి కలిగిన భూముల్లో ఎకరానికి 4టన్నుల దిగుబడి వస్తుంది. గోంగూరను ఎర్రనేలలు, తేలిక రకపు నేలలతోపాటుగా, మురుగు నీరు పోయే సౌకర్య ఉన్న నేలల్లో సాగు చేయవచ్చు. ఎర్ర గోంగూర రకం వేసవిలో సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఎక్కరానికి 5 నుండి 6టన్నుల దిగుబడి వస్తుంది…
ఒక ఎకరానికి 6 కిలోల విత్తనం సరిపోతుంది.. విత్తనం వేసిన నాటి నుండి 4రోజులకు నీటి తడిని ఇవ్వాలి. గోంగూరను కోసిన ప్రతిసారి 10 కిలోల యూరియా వేసి నీరు పారించాలి… ఇకపోతే ఎటువంటి రసాయనిక మందులు వాడకపోవటం మంచిది. తప్పనిసరి పరిస్ధితుల్లో మాత్రమే పురుగుమందులు వాడాలి. గోంగూర పంటను ముఖ్యంగా దీపపు పురుగులు, పిండినల్లి, పచ్చ పురుగులు ఆశించే ప్రమాదం ఉంటుంది. వీటి నివారణకు వేపనూనెను ఒక లీటరు నీటిలో 5మి.లీ కలిపి పిచికారీ చేయాలి. లేదంటే మలాధియాన్ మందును ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చెయ్యాలి..
ఇక గోంగూర కోతల విషయానికొస్తే.. నాటిన 25 రోజులకు గోంగూర తలలను తుంచాలి. 15 నుండి 20 రోజులకు ఒకసారి కొమ్మలను తుంచుతూ కోతలు కోయాలి. 5 కోతలు కోసిన తరువాత విత్తనం కోసం వదిలిపెట్టాలి. ఇలా చేస్తే గోంగూర సాగులో అధిక దిగుబడులు సాధించవచ్చు.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందవచ్చు.. ఇప్పుడు రైతులు కూడా గోంగూరనే ఎక్కువగా పండిస్తున్నారు..