NTV Telugu Site icon

Gongidi Sunitha : తెలంగాణ ప్రాంతంలో విష నాగులు తిరుగుతున్నాయి

Gogidi Suntha

Gogidi Suntha

తెలంగాణ రాజకీయం వేడెక్కింది. నిన్న నాటకీయపరిణాల మధ్య వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆమెకు కోర్టు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్‌ మంజూరు చేసింది. అయితే.. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిలా తెలంగాణ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. అయితే.. వైఎస్‌ షర్మిల వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ఘాటుగా స్పందించారు. తెలంగాణ ప్రాంతంలో విష నాగులు తిరుగుతున్నాయంటూ ఆమె ధ్వజమెత్తారు. షర్మిల ప్రస్థానం ఏటు వైపు…ఏ లక్ష్యంతో మీరు పాదయాత్ర చేస్తున్నారు? # తెలంగాణ ఆఫ్ఘనిస్థాన్ అయితే ఇక్కడ షర్మిల ఎందుకు ఉంటున్నారు? అని ఆమె ప్రశ్నించారు. పక్క రాష్ట్రం ఏపీలో రైతుల మోటార్లకు మీటర్లు పెడుతున్నారు షర్మిల ఎందుకు అడగట్లేదు, ఏపీలో సమస్యలపై షర్మిల స్పందించాలని ఆమె డిమాండ్‌ చేశారు. షర్మిల వెనుక ఎవరు ఉండి నడిపిస్తున్నారో త్వరలోనే బయటపెడతామని సునీత వ్యాఖ్యానించారు.
Also Read : Repeat Movie Review: రిపీట్ (డిస్నీ ప్లస్ హాట్ స్టార్)

జగన్ ముఖ్యమంత్రి అయితే మాకు ఏం సంబంధం.. ఎవరి రాష్ట్రం వాళ్లదే పక్క రాష్ట్ర సీఎంగా గౌరవిస్తామని ఆమె అన్నారు. అనంతరం ఎంపీ మాలోత్‌ కవిత మాట్లాడుతూ.. తెలంగాణలో షర్మిల పొర్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మరన్నారు. కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై విషం చిమ్మడమే షర్మిల లక్ష్యమన్నారు. బయ్యారం గనులను దోచుకున్నది షర్మిల కుటుంబమని, తెలంగాణను దోచుకోవడానికే షర్మిల పాదయాత్ర అని ఆమె విమర్శించారు. ఆంధ్రాలో నీ పప్పులు ఉడకట్లేదనే తెలంగాణలో షర్మిల డ్రామాలు అని, షర్మిల తన మాటలు అదుపులో ఉంచుకోకపోతే టీఆర్ఎస్ కార్యకర్తలను ఆపడం మా వల్ల కాదన్నారు.

Also Read : Chandrababu: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. ”నన్ను, లోకేష్‌ని కూడా చంపేస్తారట..”
తెలంగాణలో ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా…కేవలం వ్యక్తిగత విమర్శలతో షర్మిల దిగజారుతున్నారని, తెలంగాణకు రావాల్సిన విభజన చట్టం హామీల గురించి షర్మిల ఎందుకు మాట్లాడట్లేదని ఆమె ప్రశ్నించారు. ఆంధ్రాలో ఓటు వేసి తెలంగాణ రాజకీయాల గురించి షర్మిల మాట్లాడటం విడ్డూరంగా వుందని, తెలంగాణలో షర్మిలకు కె.ఎ. పాల్ కన్నా తక్కువ ఓట్లు వస్తాయంటూ ఆమె ఎద్దేవా చేశారు. షర్మిల కుటుంబం మొత్తం తెలంగాణ వ్యతిరేక కుటుంబమని, మానుకోట ఘటనలో జగన్ ను వంగపల్లి దాటనివ్వలేదని, మేము షర్మిల పట్ల సంస్కారంతోనే వున్నాము…కానీ షర్మిల మాట్లాడే పద్ధతి బాగలేదని కవిత అన్నారు.