NTV Telugu Site icon

Gongadi Trisha : టీమిండియా అండర్-19కు ఎంపికైన భద్రాచలం అమ్మాయి

Gongadi Trisha

Gongadi Trisha

స్వదేశంలో న్యూజిలాండ్‌ అండర్‌-19 మహిళల జట్టుతో జరగబోయే టీ20 సిరీస్‌కు భారత జట్టును ఆల్‌ ఇండియా ఉమెన్స్‌ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అయితే.. తెలంగాణలోని భద్రాధి కొత్తగూడెం జిల్లాకు చెందిన గొంగడి త్రిష టీమిండియా అండర్‌ 19 క్రికెట్‌ జట్టుకు ఎంపికైంది. భారత అండర్-19 అమ్మాయిల జట్టు న్యూజిలాండ్ తో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. అయితే.. 15 మంది సభ్యుల అండర్-19 జట్టులో త్రిషకు కూడా చోటు దక్కింది. త్రిష 8 ఏళ్ల వయసులోనే ఎంతో ప్రతిభ చూపి జిల్లాస్థాయి అండర్-16 జట్టుకు ఆడింది. ఆపై 12 ఏళ్ల వయసులో అండర్-19 జట్టుకు ఆడటం విశేషం. దీంతో పాటు.. 12 ఏళ్ల వయసులోనే హైదరాబాద్ మహిళల జట్టుకు ఎంపికై సంచలనం సృష్టించింది త్రిష.
Also Read : Chiranjeevi: ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ అవార్డు.. అంతా వారివలనే అన్న చిరు

చిన్న వయసులోనే బీసీసీఐ ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది త్రిష.ప్రధానంగా లెగ్ స్పిన్నర్‌గానే కాకుండా.. బ్యాటింగ్ లోనూ తన ప్రతిభను కనబరుస్తూ ఆల్ రౌండర్‌గా దూసుకుపోతోంది. బౌలింగ్ లో అత్యధిక డాట్ బాల్స్ రికార్డు త్రిష పేరిట ఉన్నాయి. అయితే.. ఈ మొత్తం మ్యాచ్‌లన్నీ ముంబై వేదికగా జరగనున్నాయి. నవంబర్‌ 27న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇక 15 మంది సభ్యుల భారత జట్టుకు శ్వేతా సెహ్రావత్ కెప్టెన్‌గా ఎంపికైంది.
Also Read : Megastar Chiranjeevi: చిరంజీవికి అరుదైన గౌరవం.. ప్రకటించిన కేంద్రం