Millionaire Sweeper: పారిశుధ్య కార్మికుడుకు 9 లగ్జరీ వాహనాలు.. బ్యాక్ గ్రౌండ్ మాములుగా లేదుగా..
- గోండా మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న ఓ పారిశుధ్య కార్మికుడు 9 లగ్జరీ వాహనాలకు యజమానిగా మారాడు.
- ఎఫ్‌ఐఆర్ ఫైళ్లలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదు అందడంతో అప్పటి కమిషనర్ యోగేశ్వర్ రామ్ మిశ్రా విచారణ.
- కమిషనర్ ఆదేశాల మేరకు జరిపిన విచారణలో ఈ విషయం వెల్లడైంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Millionaire Sweeper: గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్ జిల్లాలో గోండా మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న ఓ పారిశుధ్య కార్మికుడు 9 లగ్జరీ వాహనాలకు యజమానిగా మారాడు. వీటిలో ఇన్నోవా, జిలో నుండి మహీంద్రా స్కార్పియో ఇంకా మారుతి ఎర్టిగా వరకు వాహనాలు ఉన్నాయి. భార్య పేరు మీద ఇన్నోవా, సోదరుడి పేరు మీద ఎర్టిగా రిజిస్టర్ చేయబడింది. కమిషనర్ ఆదేశాల మేరకు జరిపిన విచారణలో ఈ విషయం వెల్లడైంది. రవాణా శాఖలో పారిశుధ్య కార్మికుల పేరుతో 9 వాహనాలు రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. అసిస్టెంట్ డివిజనల్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (అడ్మినిస్ట్రేషన్) తన విచారణ నివేదికతో పాటు వాహనాల వివరాలను అదనపు కమిషనర్‌కు పంపారు. అతని సంపాదన చూసి అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు అధికార యంత్రాంగం స్వీపర్ ఆస్తుల వివరాలు, బ్యాంకు ఖాతాల విచారణలో నిమగ్నమై ఉంది.
నగర పోలీసు ఏరియాలోని పోర్టర్ గంజ్లో నివసిస్తున్న సంతోష్ కుమార్ జైస్వాల్ మున్సిపాలిటీలో స్వీపర్ గా ఉన్నారు. కొన్నేళ్ల క్రితం సంతోష్ కమిషనర్ కార్యాలయానికి అటాచ్ అయ్యారు. ఇక్కడ నిబంధనలను దాటవేస్తూ నజీర్ గా మారి ఫైళ్లను తారుమారు చేయడం ప్రారంభించాడు. ఫైళ్లను తారుమారు చేసి కోట్లాది రూపాయల ఆస్తిని సంపాదించాడు. అతను, తన కుటుంబ సభ్యుల పేరుతో అనేక లగ్జరీ వాహనాలను కూడా కొనుగోలు చేశాడు. సంతోష్ ఆట గురించి అధికారులకు తెలియకపోవడంతో ఎలాంటి ఆందోళన చెందకుండా ఫైళ్లను ట్యాంపరింగ్ చేస్తూనే ఉన్నాడు.
Also Read
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
ఎఫ్‌ఐఆర్ ఫైళ్లలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదు అందడంతో అప్పటి కమిషనర్ యోగేశ్వర్ రామ్ మిశ్రా విచారణ జరిపించడంతో సంతోష్ జైస్వాల్ దోపిడీ బట్టబయలైంది. కార్యాలయంలో నజీర్ పదవిలో ఉంటూ స్వీపర్ సంతోష్ ఫైళ్లను తారుమారు చేసి అదృశ్యం చేసి కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించినట్లు సమాచారం. దీంతో కమిషనర్ ఆదేశాల మేరకు పారిశుద్ధ్య కార్మికుడు సంతోష్ జైస్వాల్ ను సస్పెండ్ చేయడంతోపాటు నగర పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారు. సంతోష్ జైస్వాల్ ఆస్తులపై విచారణ జరపాలని సదర్ తహసీల్దార్ దేవేంద్ర యాదవ్‌ను కూడా కమిషనర్ ఆదేశించారు.
ప్రస్తుత కమిషనర్ శశిభూషణ్‌లాల్ సుశీల్‌కు సంబంధించిన సమాచారం ఇవ్వాలని కమిషనర్ ఆదేశాల మేరకు సదరు తహసీల్దార్ అసిస్టెంట్ డివిజనల్ ట్రాన్స్‌పోర్ట్ అధికారికి లేఖ రాశారు. సదరు వాహనాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అసిస్టెంట్ డివిజనల్ ట్రాన్స్‌పోర్ట్ అధికారికి లేఖ రాశారు. ఇప్పుడు అసిస్టెంట్ డివిజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ అడ్మినిస్ట్రేషన్ తన విచారణ నివేదికను పంపింది. రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నిందితుడు పారిశుధ్య కార్మికుడు ఒకటి కాదు ఏకంగా 9 లగ్జరీ వాహనాలకు యజమానిగా మారాడు. ఈ వాహనం అతని, అతని సోదరుడు, భార్య పేరు మీద ఉంది. సఫాయి కర్మచారి సంతోష్ జైస్వాల్ స్విఫ్ట్ డిజైర్, ఎర్టిగా మారుతీ సుజుకీ, మహీంద్రా స్కార్పియో, టయోటా ఇన్నోవా, మహీంద్రా జిలోలను కలిగి ఉండగా.. ఎర్టిగా మారుతీ సుజుకి సోదరుడు ఉమాశంకర్ జైస్వాల్ పేరు మీద కొనుగోలు చేయబడింది. అలాగే అతని భార్య కోసం టయోటా ఇన్నోవా కారును కొనుగోలు చేశారు. ఇకపోతే స్వీపర్ సంతోష్ జైస్వాల్ ఆస్తులు, బ్యాంకు ఖాతాలపై అధికారులు దృష్టి పెట్టారు. అతని బ్యాంకు ఖాతాలపై సోదాలు చేస్తున్నారు. గత ఐదేళ్ల లావాదేవీల రికార్డులను బ్యాంకుల నుంచి తెప్పించారు..
తాజావార్తలు
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!