NTV Telugu Site icon

Apple CEO: కుబేరుడుకు తప్పని క్రెడిట్ కార్డ్ తిప్పలు.. ఇచ్చేదేలేదన్న బ్యాంక్

Goldman Sachs

Goldman Sachs

Apple CEO: సాధారణంగా నెలసరి జీతం పొందే వ్యక్తులు క్రెడిట్ కార్డులు సులభంగా పొందుతారు. మంచి ఉద్యోగం, జీతం బాగా వస్తుంటే ఏ బ్యాంకు అయినా క్రెడిట్ కార్డ్ ఇవ్వడానికి నిరాకరించదు. భారతదేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. అదే సమయంలో.. అందుకోని వారు చాలా ఎక్కువ మందే ఉన్నారు. అమెరికాలో క్రెడిట్ కార్డ్ వాడకం చాలా ఎక్కువగా ఉంది. ఇదే క్రమంలో ప్రముఖ ప్రపంచంలోనే ఫేమస్ కంపెనీ Apple CEO టిమ్ కుక్‌కి క్రెడిట్ కార్డ్ ఇవ్వడానికి బ్యాంక్ నిరాకరించింది. ఏంటి మీరు నమ్మడం లేదా ఇది నిజం..

ప్రపంచంలోని అతిపెద్ద లిస్టెడ్ కంపెనీ Apple. ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్ గోల్డ్‌మన్ సాచ్స్‌తో కలిసి Apple క్రెడిట్ పేరుతో సహ-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను కూడా అందిస్తుంది. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా ఆ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ అది తిరస్కరించబడింది. ఈ సంఘటన పాతదేం కాదు. ఆ సమయంలో టిమ్ కుక్ ఆపిల్ కంపెనీ CEO. ఇది ఆగస్టు 2019లో జరిగింది. Apple, Goldman Sachs కలిసి Apple క్రెడిట్‌ని ఒకే సమయంలో ప్రారంభించాయి. దాని పరీక్ష కొనసాగుతోంది. టిమ్ కుక్ కూడా చాలా మంది లాగానే Apple క్రెడిట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. Apple అతిపెద్ద అధికారి, బిలియన్ల సంపద ఉన్నప్పటికీ అతని దరఖాస్తు తిరస్కరించబడింది.

Read Also:Mining Contract: ఖనిజాల తవ్వకాలు ప్రైవేటుకు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం

టిమ్ కుక్ ప్రస్తుత నికర విలువ దాదాపు 2 బిలియన్ డాలర్లు. 2022 సంవత్సరంలో కుక్ ఆపిల్ నుండి 99.4 మిలియన్ డాలర్లు అంటే రూ. 815 కోట్లు అందుకున్నాడు. ఇందులో 3 మిలియన్ డాలర్ల జీతం కూడా ఉంది. 83 మిలియన్ డాలర్ల స్టాక్ అవార్డు, బోనస్ కూడా అందుకున్నారు. ఇది 2021లో వచ్చిన మొత్తం కంటే ఎక్కువ. 2021లో అతను 98.7 మిలియన్ డాలర్లను పొందాడు.

టిక్ కుక్ క్రెడిట్ కార్డ్ దరఖాస్తు తిరస్కరణకు కారణం కూడా ఓ నివేదికలో పేర్కొనబడింది. వాస్తవానికి, టిమ్ కుక్ పేరు, గుర్తింపును ఉపయోగించి మరొకరు క్రెడిట్ కార్డ్ పొందడానికి ప్రయత్నిస్తున్నారని గోల్డ్‌మన్ సాచ్స్ అనుమానించారు. గోల్డ్‌మన్ సాచ్స్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు వాస్తవికత గురించి తెలుసుకున్నప్పుడు మెటల్ కార్డ్ ఆపిల్ CEOకి జారీ చేయబడింది.

Read Also:Rajdhani Express: రాజధాని ఎక్స్‌ప్రెస్‌కి బాంబు బెదిరింపు.. తీరా చూస్తే..