NTV Telugu Site icon

Golden Globe Awards 2024: గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌.. ఓపెన్‌హైమర్‌కు ఐదు అవార్డులు!

Golden Globes 2024

Golden Globes 2024

Cillian Murphy and Lily Gladstone Wins Golden Globes 2024 Awards: ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ అవార్డ్స్‌ 2024లో హాలీవుడ్ చిత్రం ‘ఓపెన్‌హైమర్‌’ సత్తా చాటింది. ఏకంగా ఐదు విభాగాలలో అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ నటుడు (సిలియన్‌ మర్ఫీ), ఉత్తమ దర్శకుడు (క్రిస్టఫర్‌ నోలన్‌), ఉత్త‌మ సహాయ నటుడు (రాబర్ట్ డౌనీ జూనియర్), ఉత్త‌మ‌ ఒరిజినల్ స్కోర్ (లుడ్విగ్ గోరాన్సన్) మరియు ఉత్తమ చిత్రం కేటగిరిల్లో ఓపెన్‌హైమర్‌కు అవార్డులు వచ్చాయి. క్రిస్టఫర్‌ నోలన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హాలీవుడ్ న‌టుడు సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించారు. తేడాది విడుదలైన ఓపెన్‌హైమర్‌ సంచలనం సృష్టించింది.

ఉత్త‌మ న‌టి అవార్డు ‘కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్’ సినిమాలో న‌ట‌న‌కు గాను లిల్లీ గ్లాడ్‌స్టోన్ గెలుచుకున్నారు. ఉత్తమ హాస్య నటిగా ఎమ్మా స్టోన్, ఉత్తమ హాస్య నటుడుగా పాల్ గియామట్టి ఎంపికయ్యారు. ‘బార్బీ’ సినిమా కూడా పలు కేటగిరీల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ప్రపంచ చలన చిత్ర రంగంలో ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ అవార్డులను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. 81వ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్‌లో అంగరంగ వైభవంగా జ‌రిగాయి. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో హాలీవుడ్ ప్ర‌ముఖులు సందడి చేశారు.

గోల్డెన్ గ్లోబ్‌ విజేతలు (Golden Globe Awards 2024 Winners List):
ఉత్తమ చిత్రం-ఓపెన్‌హైమర్‌
ఉత్తమ కామెడీ చిత్రం-పూర్‌ థింగ్స్‌
ఉత్తమ ఆంగ్లేతర చిత్రం-అనాటమీ ఆఫ్ ఎ ఫాల్
ఉత్తమ యానిమేటెడ్‌ చిత్రం-ది బాయ్ అండ్ ది హెరాన్
బాక్సాఫీస్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు-వార్నర్ బ్రదర్స్ (బార్బీ)
ఉత్తమ దర్శకుడు-క్రిస్టఫర్‌ నోలన్‌ (ఓపెన్‌హైమర్‌)
ఉత్తమ స్క్రీన్‌ప్లే-జస్టిన్‌ సాగ్‌ ట్రైట్‌, ఆర్ధర్‌ హరారి (అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌)
ఉత్తమ నటుడు-సిలియన్ మర్ఫీ (ఓపెన్‌హైమర్‌)
ఉత్తమ నటి-లిల్లీ గ్లాడ్‌స్టోన్ (కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్)
ఉత్తమ హాస్య నటి-ఎమ్మా స్టోన్ (పూర్‌ థింగ్స్‌)
ఉత్తమ హాస్య నటుడు-పాల్ గియామట్టి (ది హోల్డోవర్స్)
ఉత్తమ సహాయనటి-డావిన్ జాయ్ రాండోల్ఫ్ (ది హోల్డోవర్స్)
ఉత్తమ సహాయనటుడు-రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌-వాట్‌ వాస్‌ ఐ మేడ్‌ (బార్బీ)
ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌-లుడ్విగ్ గోరాన్సన్ (ఓపెన్‌హైమర్)

 

Show comments