Hyderabad Gold Price Today: గోల్డ్ ప్రియులకు బంగారం ధరలు భారీ షాక్ ఇస్తున్నాయి. గత వారం రోజులుగా పసిడి పరుగులు పెడుతూనే ఉంది. ప్రతి రోజు భారీ మొత్తంలో పెరగడంతో తులం బంగారం లక్ష దాటి పరుగులు పెడుతోంది. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.950.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1040 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (జులై 23) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.93,800గా.. 24 క్యారెట్ల ధర రూ.1,02,330గా నమోదైంది.
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,800గా.. 24 క్యారెట్ల ధర రూ.1,02,330గా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,950గా.. 24 క్యారెట్ల ధర రూ.1,02,480గా నమోదైంది. మరో 2-3 రోజుల్లో ఆషాడ మాసం ముగిసి.. శ్రావణమాసం మొదలవుతుంది. శ్రావణమాసంలో పెళ్లిళ్ల సీజన్, వరుస పండుగల నేపథ్యంలో జనాలు బంగారం కొనేందుకు ప్లాన్ చేస్తుంటారు. ఈ సమయంలో ఊహించని రీతిలో పసిడి పరుగులు తీస్తోంది. బంగారం పరుగులు పెడుతుండటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.
Also Read: Crime News: ఎంగిలి గ్లాసులో మద్యం పోస్తారా?.. బర్త్ డే పార్టీలో స్నేహితులను పొడిచిన యువకుడు!
మరోవైపు వెండి కూడా భారీగా పెరుగుతోంది. నిన్న కిలో వెండిపై రెండు వేలు పెరగగా.. ఈరోజు వెయ్యి పెరిగింది. బులియన్ మార్కెట్‌లో ఈరోజు కిలో వెండి రూ.1,19,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ఒక లక్ష 29 వేలుగా ఉంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో కిలో వెండి ఒక లక్ష 19 వేలుగా కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 10 గంటల వరకు పలు వెబ్‌సైట్లో నమోదైన బంగారం, వెండి ధరలు ఇవి. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉంటాయన్న విషయం గుర్తుంచుకోవాలి.
