Gold Rates Today: బంగారం కొనేవారికి ఇది గడ్డుకాలం. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనేవారు దారి ధర చూసుకోవాల్సిన సమయం. ఈ వారంలో పసడి ధర పరిగెత్తుతోంది. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1797.25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు 23.49 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.46 వద్ద ఉంది. ఇక దేశీయంగా చూస్తే బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.49,900 వద్ద ఉంది. నాలుగు రోజుల వ్యవధిలో రూ.700 మేర పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.55 వేలకు చేరువలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్యూర్ 24 క్యారెట్ల గోల్డ్ రేటు పదిగ్రాములు రూ.54,400 వద్ద నమోదవుతోంది. ఇక వెండి విషయానికి వస్తే ఆల్ టైమ్ హై లో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.73 వేల వద్ద ఉంది. గత నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.2200 మేర పెరిగింది. ఒక్క నవంబర్ నెలలోనే రూ.4500 మేర పెరిగింది. నవంబర్ 4న కిలో వెండి రేటు హైదరాబాద్‌లో రూ.64,000 వద్ద ఉంది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచిన విషయం తెలిసిందే. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు 35 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచింది. ఇది ఆర్థిక మాంద్యం సంకేతాలను సూచిస్తోంది. డిసెంబర్ 13-14 తేదీల్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక సమావేశం జరగనుంది. మరి వడ్డీ రేట్లు అక్కడ ఎంత మేర పెరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది.
Gold Rates Today: గోల్డ్ కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన ధర

Diwali Gold Sales