బ్రేకులు ఫెయిలైన బండి లాగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. నేడు మరోసారి గోల్డ్, సిల్వర్ ధరలు భగ్గుమన్నాయి. ఈరోజు కిలో వెండిపై రూ.5,000 పెరగగా.. తులం గోల్డ్‌పై రూ. 380 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.14,253, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.13,065 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 350 పెరగడంతో రూ. 1,30,650 వద్ద అమ్ముడవుతోంది.
Also Read:NIA: మరోసారి మా ఇల్లు ఆశ్రమంలో ఎన్ఐఏ అధికారుల సోదాలు..
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 పెరగడంతో రూ. 1,42,530 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,800 గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,42,680 వద్ద ట్రేడ్ అవుతోంది. కిలో వెండిపై రూ. 5000 పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 2,92,000 వద్దకు చేరింది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 2,75,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
