Gold and Silver Prices Drop: బంగారం, వెండి ధరల పతనం వెనుక డొనాల్డ్ ట్రంప్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold and Silver Prices Drop: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇటీవల భారీగా పడిపోవడం పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలు ఈ పతనానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.. ఆయన వ్యాఖ్యలతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణంపై అనిశ్చితి పెరగడంతో, బంగారం, వెండి మార్కెట్లపై ఒత్తిడి పెరిగింది. భారతీయ మార్కెట్లలో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. డొనాల్డ్ ట్రంప్ ప్రకటనల అనంతరం స్టాక్ మార్కెట్ తొలుత కుదేలైనప్పటికీ, తర్వాత కొంత కోలుకుని లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 185 పాయింట్లు పెరిగి ముగియడం గమనార్హం. అయితే స్టాక్ మార్కెట్ పునరుద్ధరణ జరిగినా, బంగారం, వెండి ధరలు మాత్రం భారీగా పడిపోయాయి. వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. శుక్రవారం ఒక్కరోజులోనే వెండి ధర సుమారు 8 శాతం పడిపోయి కిలో రూ.2,24,500కు చేరింది. అంటే దాదాపు రూ.19,000 వరకు తగ్గుదల నమోదైంది. ఇదే సమయంలో బంగారం ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. MCXలో ట్రేడింగ్ సమయంలో బంగారం ధరలు సుమారు 4 శాతం తగ్గి, 10 గ్రాముల ధర రూ.1,47,100కు చేరింది.
Also Read
- Heavy Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..
- Tilak Varma: మ్యాచ్ గెలిచిన తర్వాత వర్మ వినూత్న సెలబ్రేషన్స్.. కౌంటర్ మాములుగా ఇవ్వలేదుగా..
- Basit Ali: 'తిలక్ వర్మనే అసలైన హీరో'.. తెలుగు తేజంపై పాకిస్థాన్ మాజీ దిగ్గజం కీలక వ్యాఖ్యలు..
- Nitish Kumar Reddy: మ్యాచ్ మా వైపు తిప్పుకోవడానికి మేము చేసిన ప్లాన్ ఇదే.. సక్సెస్ అయ్యాం..
గత రెండు నెలలుగా పసిడి, వెండి ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. జనవరి 29న వెండి ధర కిలోకు రూ.4,25,000కు చేరగా, అదే రోజు బంగారం ధర 10 గ్రాములకు రూ.1,93,096గా నమోదైంది. ప్రస్తుతం వాటి ధరలు ఆ గరిష్ఠ స్థాయిలతో పోలిస్తే గణనీయంగా తగ్గిపోయాయి. వెండి ధర సుమారు రూ.2 లక్షల మేర తగ్గగా, బంగారం ధర దాదాపు రూ.45 వేల వరకు పడిపోయింది. పెట్టుబడుల పరంగా చూస్తే, గత ఏడాది బంగారం 70 శాతం పైగా రాబడిని ఇచ్చింది. వెండి ధరలు మరింతగా పెరిగి పెట్టుబడిదారులను ఆకర్షించాయి. ముఖ్యంగా యువతలో బంగారం, వెండిపై పెట్టుబడి ఆసక్తి పెరుగుతోంది. ఇటీవలి కాలంలో పారిశ్రామిక అవసరాల కారణంగా వెండికి డిమాండ్ పెరుగుతోంది. ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, హరిత ఇంధన రంగాలలో వెండి వినియోగం ఎక్కువవుతోంది.
ఇదిలా ఉండగా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న వడ్డీ రేట్ల నిర్ణయాలు కూడా ఈ లోహాల ధరలపై ప్రభావం చూపించాయి. ఫెడ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడంతో పెట్టుబడిదారులు ఇతర మార్గాలపై దృష్టి పెట్టడం వల్ల బంగారం, వెండి ధరలు పడిపోయినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా, అంతర్జాతీయ పరిణామాలు, ఆర్థిక విధానాలు మరియు పెట్టుబడిదారుల మారుతున్న ధోరణులు బంగారం, వెండి ధరల్లో ఈ పతనానికి కారణమవుతున్నాయి. ఇకముందు కూడా ఈ లోహాల ధరలు గ్లోబల్ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి మారే అవకాశం ఉంది. మొత్తంగా స్టాక్ మార్కెట్లను.. బంగారం, వెండి ధరలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసే పొంతన లేని ప్రకటనలు.. హెచ్చరికలు పూర్తిగా ప్రభావితం చేస్తున్నాయి..
తాజావార్తలు
-
Heavy Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..
-
Tilak Varma: మ్యాచ్ గెలిచిన తర్వాత వర్మ వినూత్న సెలబ్రేషన్స్.. కౌంటర్ మాములుగా ఇవ్వలేదుగా..
-
Basit Ali: ‘తిలక్ వర్మనే అసలైన హీరో’.. తెలుగు తేజంపై పాకిస్థాన్ మాజీ దిగ్గజం కీలక వ్యాఖ్యలు..
-
Jio IPO Creates 12 Records: జియో ఐపీఓ సరికొత్త రికార్డ్స్.. రూ.7.4 లక్షల కోట్ల బిడ్స్, 1.38 కోట్ల దరఖాస్తులు!
-
Nitish Kumar Reddy: మ్యాచ్ మా వైపు తిప్పుకోవడానికి మేము చేసిన ప్లాన్ ఇదే.. సక్సెస్ అయ్యాం..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!