Site icon NTV Telugu

Gold Price Today: షాకింగ్.. వరుసగా నాలుగో రోజు! హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతంటే

Gold Price Today

Gold Price Today

Gold and Silver Price Hyderabad on August 7 2025: బంగారం కొనుగోలు దారులకు షాకింగ్ న్యూస్. వరుసగా నాలుగో రోజు పసిడి ధరలు పెరిగాయి. గత మూడు రోజుల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.50, 750, 100 పెరగగా.. ఈరోజు రూ.200 పెరిగింది. అదే సమయంలో 24 క్యారెట్లపై రూ.50, 820, 110 పెరగగా.. నేడు రూ.220 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (ఆగష్టు 7) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.94,000గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,02,550గా ట్రేడ్ అవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.94,000గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,02,550గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.94,150గా.. 24 క్యారెట్ల ధర రూ.1,02,700గా ట్రేడ్ అవుతోంది. వరుసగా ధరలు పెరగడంతో పసిడి ప్రియులు షాక్ అవుతున్నారు. పెళ్లిళ్ల సీజన్లో గోల్డ్ రేట్స్ ఇంక్రీజ్ అవ్వడంతో వధువు పేరెంట్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలను చూస్తే.. సామాన్యులు గోల్డ్ కొనే పరిస్థితి లేదు.

Also Read: Kishan Reddy: ఓవైసీ కుటుంబానికి సీఎం పదవి ఇచ్చినా ఆశ్చర్యం లేదు.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

మరోవైపు వెండి ధరలు కూడా షాక్ ఇస్తున్నాయి. వరుసగా మూడో రోజు వెండి రేట్స్ పెరిగాయి. గత రెండు రోజుల్లో రూ.2000, రూ.1000 పెరగగా.. ఈరోజు రూ.1000 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.1,17,000గా ట్రేడ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ఒక లక్ష 27 వేలుగా నమోదైంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ఒక లక్ష 17 వేలుగా ఉంది. ఉదయం 10 గంటల వరకు పలు వెబ్‌సైట్లో నమోదైన బంగారం, వెండి ధరలు ఇవి.

Exit mobile version