భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold

మన దేశంలో పసిడికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా మొన్నటి వరకు బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే… గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో ఈరోజు భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవాళ బంగారం ధరలు తగ్గాయి.

హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 100 తగ్గి రూ. 44,850 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 110 తగ్గి రూ. 48, 930 కి చేరింది. దేశీయంగా మార్కెట్లు తిరిగి క్రమంగా పుంజుకోవ‌డంతో బంగారం ధ‌ర‌లు తగ్గుముఖం ప‌డుతున్నాయి. ఇక బంగారం ధ‌ర‌లతో పాటుగా వెండి ధ‌ర‌లు కూడా తగ్గాయి. కిలో వెండి ధ‌ర రూ. 1100 తగ్గి రూ. 66,500 వ‌ద్ద కొనసాగుతోంది.