దేశంలో గత రెండు సంవత్సరాలుగా బంగారం, వెండి ధరలు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. ఈ క్రమంలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో 81 వేలు దాటింది. మరోవైపు కిలో వెండి లక్ష దాటేసింది. ఇప్పుడు బంగారానికి ఉన్న క్రేజ్ డాలర్‌కు కూడా లేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గోల్డ్ అన్‌స్టాపబుల్ మార్కెట్ స్పీడ్‌కు మద్యతరగతి ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే ధరలు పెరగడం తప్పితే.. తగ్గే అవకాశాలు కనిపించడం లేదు.
బంగారం పెరుగదల శాతం 2024లోనే 31శాతంగా ఉంది. 2014లో 28 వేలు ఉన్న తులం గోల్డ్.. ఇప్పుడు 81 వేలు దాటింది. 2005 నుంచి 2024 వరకు పెరుగదల శాతం ఏకంగా 455గా ఉంది. ఈరేంజ్‌లో పెరుగుతుందని ఎవరూ ఊహించలేదు. బంగారం ధరలు ఇలానే కొనసాగితే.. వచ్చే ఏడాది దీపావళి నాటికి రూ.1 లక్షకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వెండి కూడా రూ.1.25 లక్షల నుంచి రూ.1.30 లక్షలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో బంగారం కంటే వెండి అమ్మకాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందట.
Also Read: SRH Retention List: అభిషేక్ శర్మకు జాక్‌పాట్.. అతడికి మాత్రం నిరాశే!
బంగారం ధరలు భారీగా పెరగటానికి ప్రధాన కారణం కొనుగోలుదారుల సంఖ్య పెరగడమే అని ఓ ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ కంపనీ పేర్కొంది. అంతేకాదు భౌగోళిక పరిస్థితులు, దేశాల మధ్య యుద్ధం, అమెరికా ఎన్నికలు, పలు దేశాల సెంట్రల్ బ్యాంకుల రేట్లు పెరగడం.. వంటివి ప్రధాన కారణం అని తెలిపింది. ఇక స్టాక్ మార్కెట్లు పతనమైన సమయంలో ఇన్వెస్టర్లు నష్టాల నుంచి బయటపడడానికి బంగారం మీద పెట్టుబడి పెట్టడం మొదలు పెట్టారు. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కూడా బంగారం పెరుగుదలకు మరో మరో కారణం.