Gold Today Rate on 9th August 2023 in India and Hyderabad: బులియన్ మార్కెట్‌లో గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో బుధవారం (ఆగష్టు 9) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,050 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,060గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 తగ్గింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో బుధవారం ఉదయం నమోదైనవి. దేశంలోని పలు రాష్ట్రాల్లో తులం బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,210గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,450లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,440 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,050 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,060గా కొనసాగుతోంది.
Also Read: Suryakumar Yadav: చెలరేగిన సూర్యకుమార్, మెరిసిన తిలక్.. మూడో టీ20లో భారత్ ఘన విజయం!
మరోవైపు వెండి ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ. 74,000లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 1000 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 74,000గా ఉండగా.. చెన్నైలో రూ. 77,300గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 73,000 ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 77,300లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 77,300ల వద్ద కొనసాగుతోంది.