NTV Telugu Site icon

Gold Today Price: మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు! తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Lady

Gold Rate Lady

Gold Today Rate on 3rd August 2023 in India and Hyderabad: బులియన్ మార్కెట్‌లో బుధవారం పెరిగిన బంగారం ధరలు.. నేడు భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో గురువారం (ఆగష్టు 3) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,100 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,110గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 300.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 330 తగ్గింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో గురువారం ఉదయం నమోదైనవి. దేశంలోని పలు రాష్ట్రాల్లో తులం బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,260గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,500లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,550 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,110గా కొనసాగుతోంది.

మరోవైపు వెండి ధరలు కూడా తగ్గాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ. 77,300లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 700 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 77,300గా ఉండగా.. చెన్నైలో రూ. 80,300గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 76,000 ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 80,300లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,300ల వద్ద కొనసాగుతోంది.

Also Read: Gold Health Benefits: బంగారు ఆభరణాలతో అందమే కాదండోయ్ .. ఆరోగ్యం కూడా..

Also Read: Delhi : ప్రాణం తీసిన రూ.3000.. నడి రోడ్డుపై వెంటాడి.. వెంటాడి పొడిచి..