ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ అమాంతంగా పెరిగిపోతున్నాయి. మొత్తంగా చూస్తే గోల్డ్ రేట్స్ పెరగడమే తప్ప.. తగ్గడం లేదు. గత కొన్ని నెలలుగా సామాన్యులకు అందనంత ఎత్తులోనే పసిడి ధరలు ఉంటున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కాబట్టి సామాన్య ప్రజలు తప్పక కొనాల్సి వస్తోంది. అయితే నేడు బంగారం ధరలు కాస్త తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.440 తగ్గితే.. 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.400 తగ్గింది.
బులియన్ మార్కెట్‌లో సోమవారం (మే 26) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,500గా.. 24 క్యారెట్ల ధర రూ.97,640గా నమోదైంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.89,500.. 24 క్యారెట్ల ధర రూ.97,640గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,500.. 24 క్యారెట్ల ధర రూ.97,640గా కొనసాగుతోంది. చెన్నై, ముంబై, బెంగళూరు, కోల్‌కతాలో 24 క్యారెట్ల ధర రూ.97,640.. 22 క్యారెట్ల ధర రూ.89,500గా నమోదైంది. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.97,790గా.. 22 క్యారెట్ల ధర రూ.89,650గా కొనసాగుతోంది.
Also Read: AP Rains: నేడు రాయలసీమను తాకనున్న రుతుపవనాలు.. 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు!
మరోవైపు వరుసగా రెండు రోజులు తగ్గిన వెండి ధర నేడు స్వల్పంగా పెరిగింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.100 పెరిగి.. రూ.1,00,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కిలో వెండి రూ.1,11,000గా ఉంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో కిలో వెండి ఒక లక్షగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం 10 గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరలు ఇవి.
