Site icon NTV Telugu

Gold Rate Today: కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు!

Today Gold Price

Today Gold Price

ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు దేశీయంగా వరుసగా తగ్గుతూ వచ్చిన సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా పెరగని గోల్డ్ రేట్స్ ఇవాళ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 1 గ్రాము పసిడిపై రూ.120 పెరిగి.. రూ.12,322గా కొనసాగుతోంది. 22 క్యారెట్ల 1 గ్రాముపై రూ.110 పెరిగి.. రూ.11,295గా ట్రేడ్ అవుతోంది. సోమవారం (నవంబర్ 10) బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,220గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.1,200 పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,100 పెరిగి.. రూ.1,12,950గా నమోదైంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విశాఖ, విజయవాడలో స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,220గా.. ఆభరణాల తయారీకి ప్రాచుర్యం పొందిన 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,12,950గా ట్రేడ్ అవుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,24,480గా.. 22 క్యారెట్ల రేటు రూ.1,14,100గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,23,370గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,13,100గా ట్రేడ్ అవుతోంది. ఈ బంగారం ధరలకు జీఎస్‌టీ అదనంగా ఉంటుందన్న విషయం మీరు గుర్తించుకోవాలి.

Also Read: 50+50+50+200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్.. ఊహించని ఫీచర్లతో లాంచ్ అవుతున్న Xiaomi 17 Ultra!

మరోవైపు వరుసగా మూడు రోజులు స్థిరంగా ఉన్న వెండి ధర నేడు భారీగా పెరిగింది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,55,000గా నమోదైంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.2,500 ఎక్కువ. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.1,67,000గా ట్రేడ్ అవుతోంది. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరులో రూ.1,55,000గా ఉంది. బంగారం, వెండి ధరలు ప్రాంతాల వారీగా హెచ్చుతగ్గులు ఉంటాయన్న విషయం తెలిసిందే.

Exit mobile version