పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. వరుసగా 10 రోజులు పెరిగిన గోల్డ్ రేట్స్ నిన్న స్థిరంగా ఉన్నాయని సంతోషించే లోపే.. మరలా షాక్ ఇచ్చాయి. బులియన్ మార్కెట్‌లో ఈరోజు 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.333 పెరగగా.. 1 గ్రాము 22 క్యారెట్లపై రూ.305 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,32,770గా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,21,700గా నమోదైంది.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,32,770గా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,21,700గా ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు పెరిగిపోతున్న ధరలతో.. సమాన్యుడికి పసిడి అందనంత దూరంగా వెళ్లింది. ప్రస్తుతం తులం ధర లక్షన్నర వైపు పరుగులు పెడుతోంది. రాబోయే రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
మరోవైపు వెండి ధరలు మాత్రం కాస్త ఊరటనిస్తున్నాయి. వరుసగా పెరిగిన వెండి ధరలు రెండు రోజులుగా దిగొస్తున్నాయి. కిలో వెండిపై నిన్న వెయ్యి తగ్గగా.. ఈరోజ్ నాలుగు వేలు తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి 1,85,000గా కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,03,000గా నమోదైంది. గత రెండు రోజులతో పోల్చుకుంటే శుక్రవారం వెండి ప్రియులకు కాస్తా ఊరట కలిగిందనే చెప్పవచ్చు.
